మంచు మనోజ్ అతిథిగా ‘జగన్నాథ్’ టీజ‌ర్ లాంచ్

మంచు మనోజ్ చేతుల మీదుగా ‘జగన్నాథ్’ మూవీ టీజ‌ర్ లాంచ్
రాయ‌ల‌సీమ‌ భరత్ హీరోగా ‘జగన్నాథ్’ మూవీ
న‌వ్వులు పండించిన  జ‌బ‌ర్ద‌స్త్ కామెడియ‌న్స్
రాయచోటిలో ఘ‌నంగా ‘జగన్నాథ్’ వేడుక‌

భ‌ర‌త్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై భర‌త్‌, సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో, పీలం పురుషోత్తం నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మూవీ ‘జగన్నాథ్’. రాయ‌ల‌సీమ‌ భరత్, ప్రీతి జంటగా న‌టిస్తున్న ఈ మూవీ టీజర్‌ను, పోస్ట‌ర్‌ను ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ రాక్‌స్టార్ మంచు మనోజ్‌ రిలీజ్‌ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఘ‌నంగా జ‌రిగిన‌ ‘జగన్నాథ్’ మూవీ టీజర్‌ లాంచ్ వేడుక‌లో జ‌బ‌ర్ద‌స్త్ కామెడియ‌న్స్ అప్ప‌రావు, వినోదిని, గ‌డ్డం న‌వీన్ పాల్గొని వినోదం పంచారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘జగన్నాథ్’ మూవీ టీజ‌ర్ చాలా అద్భుతంగా ఉంది. త‌మ్ముడు ‘రాయ‌ల‌సీమ’ భర‌త్ చేసిన ఫ‌స్ట్ మూవీ అయిన‌ప్ప‌టికీ ఎంతో ప్రొఫెష‌న‌ల్‌గా చేశాడు. చిత్ర‌యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం క‌నిపిస్తోంది. భర‌త్ ఫ్రెండ్స్ అంతా ముందుకు వ‌చ్చి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవ‌డం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సినిమా తీయ‌డం అంత ఈజీ కాదు. అలాంటి ప‌రిస్థితుల్లో ఎంతో ఫ్యాష‌న్‌తో ఈ సినిమా తీశారు. కోటి రూపాయ‌ల‌తో తీసిన‌ సినిమా చిన్న‌ది, వెయ్యి కోట్ల‌తో తీసింది పెద్ద సినిమా అన‌డానికి లేదు. ఏదైనా సినిమానే. కాక‌పోతే, బాగుందా? బాగాలేదా? అనేదే ఉంటుంది. ఈ సినిమా ‘జగన్నాథ్’ మూవీ హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మూవీ టీం.” అని అన్నారు.

హీరో రాయ‌ల‌సీమ‌ భరత్ మాట్లాడుతూ.. ”మంచు మనోజ్ అన్న మంచి మ‌నసున్న వ్య‌క్తి.  ‘జగన్నాథ్’ మూవీ వేడుక కోసం ఆయ‌న స్వ‌చ్ఛందంగా వ‌చ్చారు. నిజంగా గ్రేట్ ప‌ర్స‌న్. సినిమాల మీద ఇష్టంతో ఎంతో క‌ష్ట‌ప‌డి ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నిరంత‌రం ప‌ని చేస్తూ 5 సంవ‌త్స‌రాల శ్ర‌మ‌తో ‘జగన్నాథ్’ మూవీని పూర్తి చేశాము. ఈ ఐదేళ్లు వెంకీ, చైతూ.. నా వెంటే ఉంటూ సొంత త‌మ్ముళ్ల మాదిరిగా క‌ష్టాలు పంచుకున్నారు. స‌పోర్టుగా నిలిచిన క‌దిరి భాష‌కు థ్యాంక్యూ. సినిమా బాగా వ‌చ్చింది.” అని అన్నారు.

తారాగణం (Cast):
రాయ‌ల‌సీమ‌ భరత్ (హీరో), సారా, ప్రీతిరెడ్డి, నిత్య‌శ్రీ, తదిత‌రులు

సాంకేతిక నిపుణులు (Crew):
దర్శకత్వం: భరత్, సంతోష్
నిర్మాత: పీలం పురుషోత్తం

సహనిర్మాతలు:
మదినే దుర్గారావు. బుక్కే వేను మాధవి
బుట్టమనేని వెంకటేష్, నాగ చైతన్య రాయల్స్

కార్యనిర్వాహక నిర్మాతలు:
మదన్ అర్జున్, రామ
డోలీ అనిల్, కింగ్ జగపతి రాజు