యన్.టి.ఆర్. 95వ జయంతి సందర్భంగా గానసభ లో మే 24వ తేదీన జి.పి.ఆర్ట్స్&కల్చరల్ అసోసియేషన్ వారు యన్.టి.ఆర్.రంగస్థలపురస్కారాన్ని లయన్ వై.కె.నాగేశ్వరరావుకు ప్రదానం చేసి కళాసింహ బిరుదు ప్రదానం చేశారు.గౌ.డా.కొణిజేటి రోశయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
డా.లక్ష్మీపార్వతి సభా ప్రారంభం చేశారు.డా.పాలకుర్తిమధుసూదనరావుగారు వై.కె.కళాసేవను కొనియాడుతూ కీలకోపన్యాసంచేశారు.డా.ఏ.విజయ్ కుమార్,శ్రీ కళా జనార్దన్ మూర్తి,కళ పత్రిక రఫీ, శంకరం వేదిక రాజేంద్రప్రసాద్,శ్రీఓంకార్ రాజు,శ్రీడి.శ్రీనివాసరాజు అతిథులుగా విచ్చేసిన ఈ సభకు శ్రీ సిహెచ్ త్రినాధరావు అధ్యక్షులు గా వ్యవహరించారు.అధ్యక్ష కార్యదర్శులు,శ్రీ నాగేంద్రరావు,శ్రీ శ్రీనివాస నాయుడు పర్యవేక్షణలో,శ్రీ గాంధీ వ్యాఖ్యానంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.