మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్, రెడ్ నొడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం “దివ్య మణి”. గిరిధర్ గోపాల్ స్టీవ్ శ్రీధర్ సంగీతాన్ని అందించిన ఈ పాటలను ప్రసాద్ ల్యాబ్స్ లొ విడుదల చేశారు. మధురా ఆడియో ద్వారా పాటలను లెజెండరీ డాన్సర్ పద్మశ్రీ ,పద్మ భూషణ్ ,పద్మ విభూషణ్ అవార్డ్ ల గ్రహీత డా.యామిని కృష్ణ మూర్తి విడుదల చేసారు.
ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరొయిన్స్ గా “దివ్య మణి” చిత్రంలొ నటిస్తున్నారు.
సురేష్ కమల్ మాట్లాడుతూ… నటుడుగా ఇది నా తొలి చిత్రం. ప్రపంచమంతా యోగా నెర్పటం కొసం తిరిగినా, నాకు తెలుగు నెలంటే చాలా ఇష్టం. గిరిధర్ గారు మంచి కధ చెప్పారు. యాక్షన్ అంతా నేను ఓరిజినల్ గా చెశాను. గిరిధర్ గోపాల్ గారు టాలెంటెడ్ పర్సన్, ఆల్ రౌండర్. ఈ సినిమా చూసిన ఎందరికొ స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ… మనిషి ని తనని తాను జాగృతి పరచుకొవటానికి సృజనాత్మకత ఎంతొ అవసరం. పాటలుబాగున్నాయంటున్నారు. సినిమా కూడా అందరినీ అలరిస్తుంది.యామిని కృష్ణ మూర్తి గారి బయోపిక్ ను ఈ సినిమా అనంతరం
భారీ గా చెస్తున్నాము. యామని గారి ఆధ్వర్యంలొ ఈ వేడుకను జరుపుకొవటం సంతోషంగా ఉందన్నారు.
ప్రాడీ కూనా మాట్లాడుతూ… గిరిధర్ గోపాల్ కధే ఈ సినిమాకు హైలెట్. అంతర్జాతీయంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి కృషి చెస్తున్నామన్నారు.
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ… సురేష్ కమల్ మాస్టర్ గారు రియల్ హీరో.ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించిన వ్యక్తి. ఆయనతో వర్క్ చెయటం మా అదృష్టం. ఈ సినిమాలొ ప్రతి స్టంట్ రియల్ గానె ఉంటుందన్నారు. ఓ అద్బతమైన కళ ను, ప్రతిభను చూడాలంటే ” దివ్యమణి ” సినిమా చూడాలన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ… గిరిధర్ గోపాల్ దివ్యమణి లొ ఎన్నొ అద్బుతాలను చూపించారు. ఈ సినిమాలొ స్టంట్స్ చూసి ఎక్సెట్ అయ్యాను. యామిని గారు ఈ కార్యక్రమంలొ పాల్గొవటం మా అదృష్టం. దివ్యమణి అందరినీ అలరించాలని ఆశిస్తున్నానన్నారు.
బలభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ… గిరిధర్ గోపాల్ నాకు దైవమిచ్చిన సోదరుడు. ఈ సినిమా ఓ అద్బుతం.ఈ సినిమాకు కధ, దర్శకత్వం, పాటలు, సంగీతం, సింగింగ్ ఇలా ఎన్నొ విభాగాల్లొ ప్రతిభను చూపాడు. తాను పెద్ద పేరు సాధించాలని కొరుకుంటున్నానన్నారు.
ప్రసాద్ రావు మాట్లాడుతూ… ఈ సినిమా వేడుకలొ
యామని కృష్ణ మూర్తి గారు పాల్గొనటం గొప్ప అదృష్టం. గిరిధర్ గోపాల్ వెరీ టాలెండెట్. త్వరలొ యామని గారి బయోపిక్ తీయటం సంతొషకరమైన విషయం. దివ్యమణి సక్సెస్ కావాలని ఆశిస్తున్నామన్నారు.
యామిని కృష్ణమూర్తి మాట్లాడుతూ… నా భాష, నా మనుషుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకొవటం ఆనందంగా ఉంది. గిరిధర్ గొపాల్ కు విజయం లభించాలని ఆశిస్తున్నానన్నారు
ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్‌ల్యాండ్), రామ్-లక్ష్మణ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్