వీఎన్ ఆదిత్య, మీనాక్షి అనిపిండి మూవీ ‘ఫణి’ టైటిల్ లాంఛ్

వీఎన్ ఆదిత్య పాన్ ఇండియా సినిమాకు “ఫణి” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డా. మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి లో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఫణి సినిమా టైటిల్,ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అమెరికాలోని డల్లాస్ లో జరిగింది. ఫణి సినిమా టైటిల్ ను డాక్టర్ తోటకూర ప్రసాద్ లాంఛ్ చేయగా,ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ అతిథులుగా పాల్గొని తమ బెస్ట్ విషెస్ అందించారు.

నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ – నేను ఇప్పటిదాకా మీకు బాగా మ్యూజిక్ చేస్తానని, పాటలు పాడతానని తెలుసు. ఫణి సినిమాతో వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో మా ఓ.ఎం.జీ ప్రొడక్షన్ బ్యానర్ పై తొలి ప్రయత్నం చేస్తున్నాము.  మూవీ ఆల్రెడీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేశాం. మిగతా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ తో మా ఓ.ఎం.జీ సంస్థలో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు మహేశ్ శ్రీరామ్ మాట్లాడుతూ – ఫణి మూవీలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన సినిమాలను మనం ఎంతగానో ఇష్టపడతాం. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మిమ్మల్ని థ్రిల్ చేసేలా ఫణి మూవీ ఉంటుంది. అన్నారు.

నటి నేహా కృష్ణ మాట్లాడుతూ – ఫణి మూవీ టైటిల్ లాంఛ్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఫణి మూవీతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, డాక్టర్ వీఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

అతిథి అనిల్ సుంకర మాట్లాడుతూ – ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ టాలీవుడ్ మూవీ మేకింగ్ లోకి రావడం హ్యాపీగా ఉంది. ఈరోజు 90శాతం టాలీవుడ్ మూవీ ప్రొడక్షన్ చేస్తున్నది అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రొడ్యూసర్సే. ఫణి మూవీ టైటిల్ బాగుంది. మీనాక్షి గారి మ్యూజిక్ ఆకట్టుకుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ . ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో మరిన్ని మూవీస్ రావాలి. అన్నారు.

హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ – ఫణి మూవీ కథ విన్న వెంటనే ఈ మూవీ చేస్తానని చెప్పాను. కథ నన్ను అంతగా ఇంప్రెస్ చేసింది. నా కెరీర్ లో చేస్తున్న ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదేనని చెప్పగలను. దర్శకుడు డాక్టర్ వీఎన్ ఆదిత్య గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్సీపిరియన్స్. ఆయనకు ఫిలింమేకింగ్ మీద ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్. అలాగే ఆయన చాలా నాలెజ్డ్ పర్సన్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. త్వరలోనే మీ ముందుకు ఓ మంచి థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాం. అన్నారు.

దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – ఫణి మూవీ టైటిల్ లాంఛ్ చేసిన డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి, బ్యానర్ లాంఛ్ చేసిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారికి , ఇతర గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మీనాక్షి మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు బాగా తెలుసు. తను సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అన్నప్పుడు ముందు ఒక షార్ట్ ఫిలిం చేయి, ప్రొడ్యూసర్ ఇబ్బందులు తెలుస్తాయి అన్నాను. కథ చెప్పండి అంది. అలా ఒక కథ చెప్పి సాయంత్రమే షూటింగ్ అంటే వెంటనే ఏర్పాట్లు చేసింది. అప్పుడు అనుకున్నా తను ప్రొడ్యూసర్ గా రాణిస్తుందని. ఫణి సినిమా కథ చెప్పగానే కేథరీన్ నాకు బాగా నచ్చింది, తప్పకుండా చేస్తానని అంది. ఆమె ధైర్యానికి అభినందనలు. ఎందుకంటే కమర్షియల్ హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలంటే, అదీ కొత్త ప్రొడక్షన్ హౌస్ అంటే అంత ఈజీగా ఒప్పుకోరు. కేథరీన్ లేకుంటే మా ఫణి మూవీ లేదు. ఈ మూవీకి వర్క్ చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్.. అన్నారు.

నిర్మాత డా. మీనాక్షి అనిపిండి త్వరలోనే వాకో సిటీ లో తను నిర్మించబోయే “ఫిష్ ఐ ” స్టూడియో బ్రోచర్ ని మాస్టర్ ధన్విన్ పాకా,మాస్టర్ శ్రీకర్ కల్లూరి ఆవిష్కరించారు.
పూర్తిగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫణి చిత్రానికి
నటీనటులు – కేథరీన్ ట్రెసా, మహేశ్ శ్రీరామ్, నేహా కృష్ణ, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, రంజిత, యోగిత, ప్రశాంతి హారతి, సాన్య, ఆకాష్, అనిల్ శంకరమంచి, కిరణ్ గుడిపల్లి, బాల కర్రి, దయాకర్, తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ – ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్
సమర్పణ – ఏయు & ఐ స్టూడియో పద్మ నాభరెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత – డాక్టర్ మీనాక్షి అనిపిండి
రచన – పద్మావతి మల్లాది
ఎడిటర్ జునైద్, కెమెరామెన్ బుజ్జి.కె.,సాయికిరణ్ అయినంపూడి
సీజీ-వి.ఎఫ్.ఎక్స్ హెన్రీ, బెవర్లీ ఫిలిమ్స్ , లాస్ ఏంజెలెస్,
స్టంట్స్ జాన్ కాన్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం – డాక్టర్ వీఎన్ ఆదిత్య