వివేక్ వ‌ర్మ `స్వ‌యంవ‌ద` టైటిల్ ఆవిష్క‌ర‌ణ‌

ఆదిత్య అల్లూరి, అనికా రావు జంట‌గా ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై వివేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్ర టైటిల్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు అల్లాణి శ్రీధ‌ర్ చిత్ర `స్వ‌యం వ‌ద‌` అనే చిత్ర టైటిల్ ను, లోగోను ఎ.వి.ఏ సుబ్బారావు, టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్క‌రించారు.
 
అనంత‌రం అల్లాణి శ్రీధ‌ర్ మాట్లాడుతూ… `వివేక్ మంచి రైట‌ర్ అని అతికొద్ది మందికే తెలుసు. ఆయ‌న నాతో క‌లిసి ప‌నిచేసిన‌ప్పుడే నాకు విష‌యం అర్ధ‌మైంది. యువ‌త ఆత్మ‌గౌరం కోసం ఎలా పోరాడింది? అన్న‌దే క‌థ‌. మంచి యూనిక్ స‌బ్జెక్ట్ ను ఎంచుకుని సినిమా చేస్తున్నాడు. క‌థ‌ను చ‌క్క‌గా క‌మ‌ర్శిలైజ్ చేసాడు . త‌ప్ప‌కుండా సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా` అని అన్నారు.
 
రాజ్ కందుకూరి మాట్లాడుతూ…` సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వివేక్ గురువు త‌గ్గ శిష్యుడ‌ని టైటిల్ ను బ‌ట్టే తెలుస్తోంది. ఇదో డిఫ‌రెంట్ మూవీ. ఇలాంటి క‌థ‌ల‌ను ఎంక‌రేజ్ చేయాలంటే నిర్మాత కూడా అంతే ఫ్యాష‌న్ గా నమ్మాలి. రాజా గారు క‌థ‌ను ఎంత బ‌లంగా న‌మ్మి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. `గౌత‌మ బుద్ధ` సినిమా టైమ్ లోనే వివేక్ నాకు ప‌రిచ‌యం. అప్ప‌టి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ వ‌ర్మ మాట్లాడుతూ…`అల్లాణి శ్రీధ‌ర్ గారి వ‌ద్ద 15 ఏళ్లు ప‌నిచేసాను. రాజ్ కందుకూరి గారి ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసి చాలా విష‌యాలు తెలుసుకున్నా. ఏ.వి.ఏన్ సుబ్బారావు గారు సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో ముందుకు వెళ్తున్నాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే స్వ‌యం వ‌ద` అనేది సాంస్కృతి ప‌దం. దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. తన గురించి తానే ఓ స‌ర్వ‌స్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్ప‌బోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెట‌ప్స్ లో క‌నిపిస్తుంది. అన్ని గెట‌ప్స్ లోనే డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఇస్తూ అనికారావు చ‌క్క‌గా న‌టించింది. ఆ పాత్ర కోసం 35 మందిని చూసి చివ‌రికి అనికా ను ఎంపిక చేసుకున్నాం. హీరో కూడా చ‌క్క‌గా న‌టించాడు. ఇలాంటి క‌థ‌ను ఒకే వేలో చెబితో బోర్ కొడుతుంది. అందుకే కామెడీ, స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించాం. టెక్నిక‌ల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. ఒక‌ పాట షూటింగ్ మిన‌హా అంతా పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి` అని అన్నారు.
 
హీరో ఆదిత్య అల్లూరి మాట్లాడుతూ… ` ఇదొక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. డైరెక్ట‌ర్ గారు క‌థ చ‌ద‌వ‌మ‌ని ఇచ్చారు. చ‌దివిన వెంట‌నే సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్ స్ వ‌చ్చాయి. సినిమా త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది` అని అన్నారు.
 
హీరోయిన్ అనికారావు మాట్లాడుతూ… ` కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి వైవిథ్య‌మైన సినిమాలో న‌టిచండం అదృష్టంగా భావిస్తున్నా. నాతో మంచి పాత్ర చేయించారు. మా ద‌ర్శ‌కుడు అనుకున్న విధంగా న‌టించాన‌ని అనుకుంటున్నా. ఒకేసారి ఆరు షేడ్స్ ఉన్న రోల్స్ చేయ‌డం ఛాలెంజింగ్ గా అనిపించింది` అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో రామ్ జ‌గ‌న్, లోహిత్ కుమార్ , చ‌క్ర‌పాణి త‌దితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృస్‌న ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌, సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: మోహ‌న్ జిల్లా, కెమెరా: వేణు ముర‌ళీధ‌ర్.వి, సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌, నిర్మాత‌: రాజా దూర్వాసుల‌