విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా టీజర్‌ను అల్లు అర్జున్ఆవిష్కరించారు. ‘మోసగాళ్లు’ చేసిన కుంభకోణం ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజర్ తెలియజేస్తోంది.ఇండియాలో మొదలై అమెరికాను వణికించిన 450 మిలియన్ డాలర్ల అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పాల్పడినవారిని వైట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ యు.ఎస్. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో ఈ టీజర్ మొదలైంది. ఈ ఐటీ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్స్ విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అని మనకు పరిచయం చేస్తుంది. నోట్ల కట్టలు కుక్కిన బ్యాగ్‌ల మధ్య ఆ ఇద్దరూ నిల్చొని కనిపించారు. “ఇది సరిపోతుంది కదా” అని కాజల్ అంటే, “ఆట ఇప్పుడే మొదలయ్యింది” అని చెప్తున్నారు విష్ణు.
‘మోసగాళ్లు’ చేసిన అతిపెద్ద భారీ స్కామ్ ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజర్ చూపించడం.. ఆ స్కామ్ వెనుక కథేమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతోంది. విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుండటం ఈ చిత్రంలోని విశేషం. తెరపై ఆ ఇద్దరి కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉన్నట్లు టీజర్‌తోనే అర్థమైపోతోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో చేస్తున్నారు.’మోసగాళ్లు’ తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్నది. ఈ చిత్రానికి శ్యామ్ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ.