విశాల్ పెళ్లి త్వరలోనే తెలుగమ్మాయితో

దక్షిణాది ప్రముఖ నటుడు విశాల్… త్వరలోనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురైన అనీషాతో విశాల్ కి త్వరలోనే నిశ్చితార్ధం జరగబోతుందని విశాల్ తండ్రి జికె రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు.
 
విశాల్ త్వరలోనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురైన అనీషాతో విశాల్ కి త్వరలోనే నిశ్చితార్ధం జరగబోతుందని విశాల్ తండ్రి జికె రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు.
 
గత కొంతకాలంగా విశాల్.. నటి వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విశాల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
 
‘నడిగర్ సంఘం’ బిల్డింగ్ పూర్తైన తరువాత పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో వెల్లడించాడు. 2019 ఏప్రిల్ నాటికి బిల్డింగ్ నిర్మాణం పూర్తి కానుంది. దీంతో విశాల్ ఇంట పెళ్లి భాజాలు మోగడం ఖాయమైంది. విశాల్, అనీషాల నిశ్చితార్ధం వేడుక హైదరబాద్ లోని ప్రముఖ హోటల్ లో జరగనుంది.
 
ఈ వేడుకకు టాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ ‘అయోగ్య’ సినిమాలో నటిస్తున్నారు. అలానే సుందర్ సి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.