విశాల్ హీరోగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై సుందర్ సి. దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న ‘యాక్షన్’. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ దీపావళికి ‘యాక్షన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విశాల్. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్ సీక్వెన్సులు ఈ టీజర్‌లో కనిపిస్తాయి. మాస్ హీరో విశాల్ ఈ యాక్షన్ పార్ట్‌ను ఎంతో డెడికేటెడ్‌గా చేశారని తెలుస్తోంది. ఒక విజువల్ ఫీస్ట్‌గా ఈ టీజర్‌ను చెప్పుకోవచ్చు. టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో అంతే అందంగా ప్రతి షాట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్ తమిళ అందించిన సంగీతం టీజర్‌ను ఎంతో ఎలివేట్ చేసేదిగా ఉంది. మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్, ముఖ్యంగా బికినీలో ఆమె కనిపించడం ఆడియన్స్‌కి కనువిందు చేసేలా ఉంది. నిర్మాత ఆర్.రవీంద్రన్ సినిమాను ఎంతో రిచ్‌గా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగే సుందర్ సి. టేకింగ్ ఓ స్టైలిష్ లుక్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో విశాల్ అండర్ కవర్ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా నటిస్తున్నారు. విశాల్ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ .
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: ఆర్.రవీంద్రన్, దర్శకత్వం: సుందర్ సి.
Vishal’s Action Teaser
Vishal is all set to test his luck with Action during this Diwali. Sundar C directed the movie and Action is extensively shot in Turkey for over three months. The makers released the teaser of the film today and it is a visual feast. Shot across some exclusive and beautiful locales of Turkey, the teaser is dosed with daredevil action stunts. The visuals are spectacular and the cinematography is a treat.Hiphop Tamiza’s music elevates the entire teaser well. Tamannaah is here to thrill the masses with her explosive glamorous show. The shots that showcases Tamannaah in a bikini is an eye feast. R Ravindran bankrolled Action on Trident Arts banner. Action is the costliest film made in Vishal’s career. Vishal plays a military commando who works on an undercover mission in Action.