యంగ్ ఛార్మింగ్ హీరో రామ్ కార్తీక్ హీరోగా సనా మక్బూల్‌ఖాన్ హీరోయిన్గా శ్రీమతి బొడ్డు శ్రీలక్ష్మీ సమర్పణలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ పతాకంపై విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో మురళి సాధనాల కో-ప్రొడ్యూసర్‌గా, వరప్రసాద్ బొడ్డు నిర్మించిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం ‘మామ ఓ చందమామ’ను మున్నా కాశి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సక్సెస్ అయి, సోషల్ మీడియాలో పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం డిసెంబర్ 8న హైదరాబాద్ దసపల్లా హోటల్లో చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో డా. రాజశేఖర్, ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవగా సీనియర్ హీరో సుమన్, జీవిత, రాజ్ కందుకూరి, హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ ససనా మక్బూల్‌ఖాన్, దర్శకుడు విశాఖ థ్రిల్లర్ వెంకట్, సంగీత దర్శకుడు మున్నా కాశీ, సీనియర్ నటి గీతాంజలి, ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి, అయోధ్యకుమార్, సంగీత దర్శకుడు శశిప్రీతమ్, నాగం తిరుపతిరెడ్డి, చందూలాల్, శ్రీనివాస్ బొడ్డు తదితరులు హాజరుకాగా, కోప్రొడ్యూసర్ మురళి సాధనాల ఫ్లవర్ బొకేలతో అతిథుల్ని స్వాగతించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. ప్లాటినమ్ డిస్క్ షీల్డ్‌లను డా. రాజశేఖర్ చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 15న రిలీజ్ కానుంది.
డా. రాజశేఖర్ మాట్లాడుతూ – ”నేను మెడికల్ కాలేజ్‌లో వున్నప్పుడు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు సుమన్‌గారికి పెద్ద ఫ్యాన్స్ వుండేవారు. బేసిగ్గా ఆయన కరాటే మాస్టర్. ఎప్పుడూ ఫిట్‌గా వుంటారు. నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ వుంది. వండ్రఫుల్ పర్సన్. ఆయన బిజీగా వుండి డేట్స్ కుదరకపోవడంతో ‘వందేమాతరం’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు టి.కృష్ణగారు. సుమన్‌గారు చేయకపోవడంతో ఆ సినిమాలో నేను నటించాను. సుమన్‌గారి వల్లే నేను హీరోని అయ్యాను. రామ్ కార్తీక్ మా పిల్లలకు మంచి ఫ్రెండ్. స్టైలిష్‌గా వున్నాడు. మంచి స్మైలింగ్ ఫేస్. చాలా ప్లెజెంట్‌గా వున్నాడు. ట్రైలర్ చూశాక సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగింది. మున్నా మ్యూజిక్ వినసొంపుగా వుంది. డైరెక్టర్ వెంకట్ చాలా బాగా తీశాడు. సినిమా బాగా వచ్చింది అని సుమన్‌గారు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది.. అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రముఖ రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ – ”హీరో చాలా క్యూట్‌గా వున్నాడు. నిర్మాతలు చాలా కష్టపడి సినిమా చేశారు. కాశీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆరు పాటలు చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ చూశాక డైరెక్టర్ వెంకట్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అన్పించింది. టైటిల్ చాలా పాపులర్. తప్పకుండా సినిమా ‘పెళ్లిచూపులు’ కంటే పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
జీవిత మాట్లాడుతూ – ”రామ్ కార్తీక్ మదర్ కోసం ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. వారి అబ్బాయి హీరో కావాలని ఆమె చాలా కలలు కన్నారు. ఈ సినిమాతో రామ్‌కార్తీక్ సక్సెస్ అవుతాడు. ప్రతి సినిమా బాగా ఆడుతుంది. నమ్మకంతో చేస్తాం. సినిమా తీయడం అంత ఈజీకాదు. తీసిన సినిమా సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలి. దానిని మీడియా ఎంతో ప్రమోట్ చెయ్యాలి. ప్రేక్షకులు మూవీ చూసి వారి ఒపీనియన్‌ని పదిమందికి తెలియజేయాలి. రివ్యూస్ మీద డిపెండ్ అవకూడదు. థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలి” అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ”ప్రస్తుతం చిన్న సినిమా విజయం వైపు పరుగులు తీస్తోంది. ‘క్షణం’ నుండి నిన్నటి ‘మెంటల్ మదిలో’ వరకు ఏ సినిమా అయినా కంటెంట్ వుంటే కంటిన్యూస్‌గా ఆడుతుంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటే కంటెంట్ వున్న సినిమాలా కన్పిస్తుంది. సాంగ్స్ అన్నీ ప్రామిసింగ్‌గా వున్నాయి. డైరెక్టర్ వెంకట్ సినిమాని బాగా తీశాడు. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తేవాలి” అన్నారు.
హీరో సుమన్ మాట్లాడుతూ – ”డైరెక్టర్ వెంకట్ కథ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. అమ్మా, చెల్లి, భార్య, కూతురు ఇలా నలుగురు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ నాది. ఇలాంటి క్యారెక్టర్ ఇంతవరకూ చెయ్యలేదు. వెరీ క్లీన్ ఫిల్మ్ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. అలాగే చక్కని సందేశం కూడా వుంది. అందర్నీ ఆలోచింపచేసే కథ ఇది. సబ్జెక్ట్ వినగానే ఈ సినిమా ఆడుతుంది అని కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా రష్ చూశాక నా కాన్ఫిడెన్స్ 200% పెరిగింది. హీరో రామ్ కార్తీక్ చాలా స్మార్ట్‌గా వున్నాడు. మా కాంబినేషన్లో వండ్రఫుల్ సీన్స్ వున్నాయి. అతని యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ఫెంటాస్టిక్‌గా చేశాడు. హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కార్తీక్‌లో వున్నాయి. టీమ్ అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులు అందరూ చూసేలా వుంటుంది. గరుడవేగతో మంచి హిట్ కొట్టిన రాజశేఖర్‌కి కంగ్రాట్స్. మధ్య మధ్యలో ఎన్ని అండ్ అండ్ డౌన్స్ వచ్చినా తన విల్పవర్తో బిగ్ హిట్ సాధించాడు. కృషి, పట్టుదలతో చేశాడు. ఇంకా మంచి హిట్స్ సాధించాలి. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ని కూడా అభినందిస్తున్నాను” అన్నారు.
నిర్మాత వరప్రసాద్ బొడ్డు బ్రదర్ శ్రీనివాస్ మాట్లాడుతూ – ”వరప్రసాద్ బొడ్డు యు.ఎస్.లో వుండటం వలన ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఫస్ట్ నాకు ఫోన్ చేసి సినిమా తీస్తున్నాను అని చాలా చెప్పాడు. దానికి నేను ‘జాగ్రత్తగా తీయాలి. సినిమా అంటే మామూలు విషయం కాదు. మంచి ఫ్యామిలీ సినిమా తియ్యాలంటే గట్స్ వుండాలి’ అని మా తమ్ముడికి మురళి సాధనాలగారి సహకారంతో వెంకట్ మంచి సినిమా తీశాడు. ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చెయ్యాలి. నెక్స్ట్ సినిమా తీయడానికి మాకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను” అన్నారు.
చిత్ర దర్శకుడు విశాఖ థ్రిల్స్ వెంకట్ మాట్లాడుతూ – ”రామ్‌గోపాల్ వర్మగారిని ఆదర్శంగా తీసుకొని డైరెక్టర్ని అవ్వాలని వైజాగ్ నుండి ఇండస్ట్రీకి వచ్చాను. గణేష్ మాస్టర్ వర్గ వద్ద కొరియోగ్రాఫర్‌గా చేశాను. డైరెక్షన్లో ఎవరి దగ్గర వర్క్ చెయ్యలేదు. కథ చెప్పగానే బాగా నచ్చి సినిమా చేద్దాం అని ముందుకు వచ్చిన మా నిర్మాతలు వరప్రసాద్ బొడ్డు, మురళిగారికి నా థాంక్స్. మరుధూరి రాజాగారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. కెమెరామెన్ జి.ఎల్.బాబు నాకు అండదండగా నిలిచి ప్రతి ఫ్రేమ్‌ని అందంగా తీర్చిదిద్దాడు. సినిమా బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఈ సినిమాకి 24 క్రాఫ్ట్స్వారు నాకు ఎంతో సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహించారు. అందరం టీమ్ వర్క్‌గా కలిసి మంచి సినిమా చేశాం. కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రంలో కామెడీ, లవ్, సెంటిమెంట్, ఎమోషన్, థ్రిల్లర్ అన్నీ వున్నాయి. హండ్రెడ్ పర్సెంట్ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంతో వున్నాం. డెఫినెట్‌గా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ – ”సుమన్, గీతాంజలి వంటి సీనియర్ నటులతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా సుమన్‌గారు ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన మా నిర్మాతలు వరప్రసాద్, మురళిగారికి నా కృతజ్ఞతలు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రం వుంటుంది. ఇంత మంచి సబ్జెక్ట్‌తో నాతో సినిమా తీసిన డైరెక్టర్ వెంకట్‌కి నా థాంక్స్. మున్నా కాశీ మ్యూజిక్, బాబు కెమెరా విజువల్స్ సినిమాకి ఎంతో ప్లస్ అవుతాయి” అన్నారు.
కో-ప్రొడ్యూసర్ మురళి సాధనాల మాట్లాడుతూ – ”చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన జీవిత, రాజశేఖర్‌గారికి థాంక్స్. అలాగే మా చిత్రంలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘మామ ఓ చందమామ’ చిత్రం అందరికీ నచ్చేవిధంగా వుంటుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.
రామ్ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రంలో సుమన్, జీవా, గీతాంజలి, సుర, దువ్వాసి మోహన్, కిరీటి, ఖయ్యూం, గెటప్ శ్రీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, ఫొటోగ్రఫీ: జి.ఎల్.బాబు, ఎడిటర్: మాధవ్ కోకా, ఆర్ట్: ఉత్తరకుమార్, సూరిశెట్టి, సంగీతం: మున్నా కాశీ, సహ నిర్మాత: మురళి సాధనాల, నిర్మాత: వరప్రసాద్ బొడ్డు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్స్ వెంకట్.