లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు జరగడం లేదు. దాంతో డైరక్టర్లు, రచయితలు కొత్త రచనలు చేస్తూ, షార్ట్ ఫిల్మ్‌లు తీస్తూ…సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నాగ చైతన్య, సమంత కాంబినేషన్లో 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కింది ఈ చిత్రం. తెలుగులో నాగ చైతన్య, సమంత .. తమిళంలో త్రిష-శింబు ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం పూర్తయ్యి పదేళ్లు పూర్త యయిన సందర్భంగా .. గౌతమ్ మీనన్ ‘విన్నైతాండి వరువాయ’కి కొనసాగింపుగా ‘కార్తీక్ డయల్ సేత్యా యెన్’ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. త్రిష, శింబులు ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తే .. ఏఆర్ రెహ్మన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అంతేకాక ఇటీవల షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.ఈ టీజర్లో జెస్సీ(త్రిష), కార్తీక్(శింబు)ను ఉద్దేశించి.. “రాయండి. మీ రచనలు చాలా అందంగా ఉంటాయి. అయితే బలవంతంగా ప్రయత్నించకండి. మీరొక ఆర్టిస్ట్.. ఏదైనా సహజంగానే జరగాలి. త్వరలోనే థియేటర్లు తెరుస్తారు.. ‘నెట్‌ఫ్లిక్స్’, ‘అమెజాన్’ వంటి సంస్థలు మిమ్మల్ని కలిసి తమ కోసం పని చేయమని కోరతాయి. వారికి కావాల్సింది మంచి రచనలు మాత్రమే. త్వరలోనే అంతా సర్టుకుంటుంది” అంటూ సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘విన్నైతాండి వరువాయ’ చిత్రంలో కార్తీక్ రచయిత. దాంతో లాక్డౌన్ గురించి బాధపడకుండా కథలు రాయమని జెస్సీ, కార్తీక్‌ను ప్రోత్సహిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం త్రిష, శింబులతో వారి ఇళ్లలోనే షూట్ చేశారు.
కమల్ హాసన్, మోహన్‌లాల్, ఆమీర్ ఖాన్
త్రిష రీసెంట్గా తన బర్త్‌డే సందర్భంగా నెటిజన్లతో చిట్ చాట్ చేసింది… ఈ చాట్‌లో నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పిన త్రిష.. మీ అభిమాన నటులు ఎవరని ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన త్రిషకు తెలుగులో తను అభిమానించే హీరోలు ఎవరూ లేరన్నట్లుగా ఆమె సమాధానం ఇచ్చింది.తన అభిమాన నటులు.. కమల్ హాసన్, మోహన్‌లాల్, ఆమీర్ ఖాన్ అని త్రిష చెప్పిన సమాధానం విన్న తెలుగువారందరూ ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇటీవల త్రిష మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి తప్పుకుంది