వి వి వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న `సీనయ్య` శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నరసింహ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి.ముహూర్తపు షాట్‌కి కె రాఘవేంద్రరావు క్లాప్ నివ్వగా… కొరటాల శివ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సి. కళ్యాణ్, దానయ్య డి.వి.వి,అనీల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ పాల్గొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ – ” వినయ్‌తో `ఆది` సినిమా నుండి నా జర్నీ..మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమాగా ఆయన దర్శకత్వంలోనే `దిల్` చేస్తే.. ఆ సినిమా పేరే నా ఇంటి పేరుగా మరెంత పెద్ద హిట్ అయ్యింది. డైరెక్టర్ శంకర్ దగ్గర కో డైరెక్టర్‌గా చేసిన నరసింహ వేరే కథ డిస్కస్ చేస్తున్నప్పుడు… ఈ సీనయ్య కథ వచ్చింది . 1982-84 బ్యాక్‌డ్రాప్‌లో ఓ సీనయ్య అనే వ్యక్తి కథ. ఎమోషనల్ స్టోరి. ఎవర్నైనా డైరెక్టర్‌ని హీరోగా చేద్దామని అనుకున్నాం. నా సినిమాలకు పనిచేసిన దర్శకుల గురించి ఆలోచిస్తున్నప్పుడు సడెన్‌గా వినాయక్ ఆలోచనకు వచ్చాడు. వినయ్ కథ విని .. ‘అన్నా!… నీ సెలక్షన్ రైట్ సెలక్షన్.. నేను యాక్ట్ చేస్తున్నాను’ అని చెప్పాడు. తిరుమలలో ఉన్న నేను అక్కడే సినిమాను ప్రకటించాను . ఫస్ట్ లుక్ చూసి ‘భలే ఉంది’ అని అందరూ అనుకున్నారు. హరి మా కథలో భాగమవుతున్నాడు. తను ఫ్యూచర్‌లో మా బ్యానర్ నుండి డైరెక్టర్‌గా కూడా ఇంట్రడ్యూస్ అవుతాడు. ఆర్టిస్టుల్లో కొత్తవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఈ సినిమా కోసం వినయ్ డేడికేషన్‌తో నాలుగు గంటల పాటు జిమ్ చేసి స్లిమ్‌గా తయారయ్యాడు “ అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ – “డెస్టినీ వింతగా ఉంది. రాజుగారు ఓ రోజు వచ్చి ‘నువ్వు నన్ను దిల్‌రాజుని చేశావ్.. నేను నిన్ను హీరోని చేద్దామనుకుంటున్నా’నని అన్నాడు. ‘ఓ స్క్రిప్ట్ విన్నాను. నువ్వు అయితే బావుంటావు. చెయ్ బావుంటుంద’ని అన్నారు . నాకు కామెడీ, పాటలు, డ్యాన్సులు వద్దు.. హుందాగా ఉంటేనే చేస్తానని చెప్పాను. ‘అలాంటి కథే’ అని దిల్‌రాజు అన్నారు. తర్వాత నరసింహ వచ్చి నాకు ఈ కథను చెప్పాడు. ఓ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఓ బయోపిక్‌లాంటి సినిమా. ఆ క్యారెక్టర్‌ను నరసింహ ఇష్టపడ్డాడో తెలిసింది. పాత్ర కోసం బరువు తగ్గాను. ఈ సినిమాకి స్క్రిప్ట్ లో హరిగారు సపోర్ట్ అందిస్తున్నారు. రాజన్నకి థ్యాంక్స్. ఆయన కథనే నమ్ముతాడు. “ అన్నారు.
డైరెక్టర్ నరసింహ మాట్లాడుతూ – “వినాయక్‌గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నప్పటికీ… మా `సీనయ్య`గా ఇది తొలి పుట్టినరోజు . మంచి ఎమోషనల్ కథ. వినయ్‌గారు, రాజుగారు నన్ను నమ్మి కొత్త బాధ్యతను… గొప్ప టెక్నీషియన్స్‌ను ఇచ్చారు. నా బాధ్యతను కరెక్ట్‌గా నిర్వహిస్తానని చెప్పారు.
రైటర్ హరి మాట్లాడుతూ – “రాజుగారితో పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను . నరసింహారావుగారు రాజుగారి దగ్గర, వినాయక్ దగ్గర కథ ఓకే చేయించుకున్న తర్వాత నేను ఇన్వాల్ అయ్యాను. వినాయక్‌గారు పెద్ద డైరెక్టర్ అయినా ఆర్టిస్ట్‌గా ప్రతి విషయాన్ని తెలుసుకుని ఫిజికల్‌గా, మెంటల్‌గా రెడీ అయ్యారు. గర్వంగా చెప్పుకునేలా సినిమాను చేస్తాం “ అన్నారు.
సంగీతం – మణి శర్మ,ఛాయాగ్రహణం – సాయి శ్రీరామ్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి,ఆర్ట్ – కిరణ్ కుమార్
రచన – డార్లింగ్ స్వామి, హరి, బాలశేఖరన్, నిర్మాతలు – రాజు, శిరీష్
కధ, చిత్రనువాదం, దర్శకత్వం – నరసింహ