విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం “కాశి”.విజయ్ ఆంటోనీ సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపాటి తెలుగులో విడుదల చెస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో మే 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ దస్పల్లా హోటల్లో జరిగింది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ , చాంబర్ అధ్యక్షుడు పి.కిరణ్ , చదలవాడ శ్రీనివాసరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని సినిమా అంటే కథా బలం ఉంటుంది.కాశి ట్రైలర్స్ ,పాటలు చూస్తుంటే ప్రామిసింగ్ మూవీలా అన్పిస్తొంది. సినిమా హిట్ అవ్వాలన్నారు.
మధు మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనీ సినిమాలు డిఫరెంట్ జోనర్. కృత్తిక గారు తపన ఉన్న డైరక్టర్. ఆల్ ది బెస్ట్ టూ ఎంటైర్ టీమ్ అన్నారు.
అమృత మాట్లాడుతూ.. రెండు భాషల్లొ విడుదలవుతోన్న ఈ సినిమాలొఅవకాశం రావటం ఆనందంగా ఉందన్నారు.
సునయన మాట్లాడుతూ.. విజయ్ గారు నా తొలి చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు హీరోగా ఆయన నటించిన చిత్రంలొ నేను హీరొయిన్ గా నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. కాశి బ్యూటిఫుల్ ప్రేమకధాచిత్రమన్నారు.
కిరణ్ మాట్లాడుతూ.. మ్యూజిషియన్ గా, హీరోగా విజయ్ మరిన్ని సక్సెస్ లు సాధించాలన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ.. కాశి సినిమా చూశాను. మంచి కాన్సెప్ట్. బాష్యశ్రీ మాటలు చాలా బాగున్నాయి. విజయ్ ఆంటోని ఎఫర్ట్ కన్పించింది. కృత్తిక గొప్ప ప్యామిలీ నుంచి వచ్చి ఈ సినిమా చెశారు. ప్రేక్షకులకు మంచి ఫీల్ కల్గించె సినిమా కాశి. బిచ్చగాడు తరహాలొ సెంటిమెంట్ తో పాటు థ్రిల్ ను కాశి అందిస్తుందన్నారు. విజయ్ ఆంటోనీ స్టైయిట్ సినిమా చెస్తారన్నారు.
భాష్యశ్రీ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనీ గారు నాలుగు డిఫరెంట్ షేడ్స్ లొ నటించారు. ప్రతి ఫ్రేమ్ ను కృత్తిక గారు అందంగా మలిచారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నా మీద నమ్మకం ఉంచిన విజయ్ ఆంటోనీ గారికి ధన్యవాదాలు అన్నారు.
ప్రద్యుమ్న మాట్లాడుతూ.. గ్రేట్ ప్యాషినెట్ ఆల్ రౌండర్ విజయ్ ఆంటోనీ . ఈ సినిమా విడుదల చెయటం గౌరవంగా భావిస్తున్నాము.
గణేష్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనీ గారి సినిమా అంటే స్పెషల్. కాశి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.
దర్శకురాలుకృత్తిక మాట్లాడుతూ... ఉమెన్ డైరక్టర్స్ కు సినిమా అవకాశం రావటం చాలా కష్టం. నా మీద నమ్మకం ఉంచి విజయ్ ఆంటోనీ అవకాశమిచ్చారు. కాశి అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా నన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..విజయ్ ఆంటొని ది రిసివబుల్ ఫేస్.”కాశి” విజయ్ ఆంటోనీ కి సక్సెస్ ఇవ్వాలి. మరిన్ని చిత్రాలు తెలుగులో చెయాలన్నారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. “కాశి” నా గత చిత్రాలతో పొలిస్తే ప్రత్యేక మైనది. క్రెడిట్ దర్శకురాలు కృత్తికాదే. నా కెరీర్ కు ప్రధాన బలం బాష్యశ్రీ. తన సపోర్ట్ కు దన్యవాదాలు. మంచి సినిమాలను మరిన్ని తీసుకురావటానికి ,తెలుగుసినిమా చేయడానికి ప్రయత్నిస్తానన్నారు.
విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, మధురాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటర్: లారెన్స్ కిషోర్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.మురళీకృష్ణ, పాటలు-మాటలు: భాష్య శ్రీ నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి, కథ-దర్శకత్వం: కృత్తిక ఉదయనిధి.