విజయ్ దేవరకొండ, పూరి జగన్నాద్ ల ఇండియా చిత్రానికి `లైగర్`(సాలా క్రాస్ బ్రీడ్) అని పేరు పెట్టారు.
పూరి కనెక్ట్స్, బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా `లైగర్`నిర్మిస్తున్నాయి. హీరోయిన్ గా అనన్యా పాండే నటిస్తోంది.`లైగర్` మూవీ టైటిల్, ఫస్ట్లుక్పోస్టర్ను అధికారికంగా విడుదలచేశారు .
టైగర్ తో లయన్ కలయిక వలన పుట్టే కొత్త బ్రీడ్ `లైగర్`.`లైగర్` టైటిల్ డిఫరెంట్‌గా ఉండడంతోపాటు ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది. హీరోలను పూర్తిగా భిన్నమైన ఆకారాలలో చూపించే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండను ఇంతవరకూ చూడని డిఫరెంట్ లుక్‌తో ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ తన ఇంటెన్స్ లుక్, పొడవాటి జుట్టుతో ఆకట్టుకున్నాడు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా “మా పాన్ ఇండియా ప్రాజెక్ట్ `లైగర్`ను సగౌరవంగా ప్రకటిస్తున్నాం. నేషన్ వైడ్ మ్యాడ్నెస్ గ్యారెంటీడ్” అని తెలిపారు.అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మికౌర్, కరన్‌జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలు.