‘సెన్సేషనల్ స్టార్’ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. దర్శక నిర్మాతలు ఫ్రాన్స్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇందులో విజయ్‌దేవరకొండ సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్‌లో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్,, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్,, ఇజాబెల్లె దె
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: క‌్రాంతి మాధవ్
సమర్పణ: కె.ఎస్.రామారావు,నిర్మాత: కె.ఎ.వల్లభ,బ్యానర్: క‌్రియేటివ్ కమర్షియల్స్
మ్యూజిక్: గోపీ సుందర్,సినిమాటోగ్రపీ: జేకే,ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్