సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ దసరా సందర్భంగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ పెద్దలంతా వచ్చారు. టి సుబ్బిరామిరెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, బివిఎస్ఎన్ ప్రసాద్,సి కళ్యాణ్.. దర్శకులు కే రాఘవేంద్రరావ్ మరియు నాగ్ అశ్విన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి గారు హీరో హీరోయిన్లపై తొలి షాట్ కు క్లాప్ కొట్టగా.. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి షాట్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ ప్రేమకథాచిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. జేకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ రామారావు సమర్పిస్తుండగా.. కేఏ వల్లభ నిర్మిస్తున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, రాశీఖన్నా,ఐశ్వర్యా రాజేష్,ఇసాబెల్లె డి
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకుడు: క‌్రాంతి మాధవ్
సమర్పకుడు: కేఎస్ రామారావు
నిర్మాత: కేఎ వల్లభ
నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫర్: జేకే
ప్రొడక్షన్ డిజైన్: సాహీ సురేష్