ఓ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ అయితే హీరో విజయ్ దేవరకొండ కావడం నిజంగా క్రేజీ కాంబినేషన్. వీరిద్దరినీ కలిపే ఆలోచన చేసింది ఎవరో తెలుసా? దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె రెడీ చేసుకొన్న ఓ కథ త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ కలయికలో సినిమాగా తెరకెక్కాల్సింది. అయితే… ఆ సినిమా చివరికి వెబ్ సిరీస్‌గా మారింది.ఏ హీరోకి ఏ దర్శకుడితో సినిమా రాసిపెట్టి ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగే ఏ క్రేజీ దర్శకుడి చిత్రం ఏ హీరో మిస్ అవుతాడో కూడా చెప్పలేం. అలాంటిదే ఓ సంఘటన. తృటిలో ఓ మంచి కాంబినేషన్ మిస్ అయింది.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ సంచలనం సృష్టించిన టైమ్‌లో అతడితో సినిమా తీయడానికి చాలా మంది దర్శకులు తహతహలాడారు. అదే టైమ్‌లో అల్లు అరవింద్ కూడా దేవరకొండతో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సరిగ్గా అదే సమయంలో త్రివిక్రమ్‌తో దేవరకొండ హీరోగా ఓ ఆఫర్ వచ్చిందట. నందినీ రెడ్డి ఓ కథతో త్రివిక్రమ్‌ను కలిసిందట. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే బాగుంటుందని సూచించిందట. కథలో ఎక్కువ లేయర్స్ ఉన్నాయని, విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది హీరోలు కూడా అవసరమని త్రివిక్రమ్ చెప్పడంతో ఆ కథ అటకెక్కేసింది.
అలా పక్కన పడేసిన కథను అశ్వనీదత్ కుమార్తె స్వప్నాదత్ బైటికి తీయించి దాన్ని వెబ్ సిరీస్‌గా మలచిందట. కొంతమంది హీరోల కలయికలో రూపొందిన ఆ వెబ్‌సిరీసే ‘గ్యాంగ్ స్టార్స్’. ఈ వెబ్‌సిరీస్‌కు మాటలు రాసిన లక్ష్మీ భూపాల ఈ విషయాన్ని రివీల్ చేయడంతో త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ కలయికలో సినిమా తృటిలో మిస్ అయిందన్న వార్త బయట పడింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.