“అర్జున్ రెడ్డి” చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోగా మారాడు.పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఈ యువహీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సమర్పకుడు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ….గేమ్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన కథ ఇది. విజయ్ దేవరకొండ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా, నేటి యువతరానికి ప్రతినిథిగా కనిపించబోతున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి తరహాలోనే ఈ చిత్రం కూడా ఆయన కెరీర్లో మరపురాని చిత్రంగా వుండబోతుంది. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా వుంటాయి. మార్చి 9న చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు. శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షిసింగ్, ఆశిష్‌రాజ్, ప్రభావతి, దీపక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అబ్భత్ సమత్, సినిమాటోగ్రఫీ: శివారెడ్డి.