విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘నోటా’ తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన నుంచి వచ్చే ఏడాది ‘డియర్ కామ్రేడ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మరో తమిళ బ్యానర్లో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం.తమిళ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ కూడా విజయ్ దేవరకొండకి ముట్టినట్టుగా చెబుతున్నారు. తమిళ .. తెలుగు భాషలతో పాటు మలయాళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ మూడు భాషల్లో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.
సొంత బ్యానర్ ‘కింగ్ ఆఫ్ ది హిల్’
విజయ్ దేవరకొండ కెరీర్ పరిధిని మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతున్నాడు. తన అభిమానులను ప్రేమగా ‘రౌడీస్’ అనిపిలుచుకునే విజయ్ ఇప్పటికే ‘రౌడీ’ పేరుతో ఓ ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించారు . ఈ యంగ్ హీరో తాజాగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నాడు. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించాడు విజయ్.ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నోటా తోనే నిర్మాణ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న నోటా సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ యంగ్ సీయంగా కనిపిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటించారు.
ఆన్లైన్ వివాదాలు నాకు ఇష్టంలేదు
విజయ్ దేవరకొండ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. తన ఫ్యాన్స్‌ను రౌడీస్ అంటూ పిలుచుకునే ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశాడు… ‘ప్రియమైన రౌడీస్ సినిమా, జీవితం, రౌడీ కల్చర్, యాటిట్యూడ్‌లతో మనం మనలా ఉండేందుకు మనం ఓ మార్పు తీసుకువస్తున్నాం. అదే సమయంలో మనం సోషల్ మీడియా పరంగా కూడా కొత్త ట్రెండ్ తీసుకురావాలి.
మీలో చాలా మంది ప్రేమతో నా ఫొటోను డీపీగా పెట్టుకుంటున్నారు. అయితే దీని కారణంగా మీ కొంత మందిలో వాదనలకు దిగుతున్నారు. నేను అలాంటివి చేయను. అందుకే మీరు కూడా చెయ్యొద్దు. నేను సాధించిన విజయాలు నా స్వశక్తి తోనే సాధించా.. అందుకే ఇతరుల గురించి నేను పట్టించుకోను. అందుకే మిమ్మల్ని ద్వేషించే వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోండి. నేను మీకు ఎప్పటికీ మంచి సినిమాలు, మంచి దుస్తులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆన్లైన్ వివాదాలు చూడటం నాకు ఇష్టంలేదు’ అంటూ ఓ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.