విజయ్‌దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించబోతున్నారు.విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ పేరుతో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.తన సినిమాల్లోని కథానాయకుల్ని అత్యంత శక్తివంతులుగా, ధైర్యశాలురుగా ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు పూరి జగన్నాథ్. హీరో పాత్ర చిత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోబోతున్నారు. చిత్రీకరణకు ఇంకా నాలుగునెలల సమయం ఉండటంతో అత్యంత సవాలుతో కూడిన శిక్షణకు ఆయన సిద్ధమవుతున్నారని తెలిసింది. “వినోదం, యాక్షన్ అంశాలు మేళవించిన కథ ఇది. అయితే మార్షల్ ఆర్ట్స్ కథాగమనంలో కీలకంగా ఉంటుంది. ఓ రకంగా సినిమాకు ఆయువుపట్టులా నిలుస్తుంది. అందుకే విజయ్‌దేవరకొండ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాం”.. అని చిత్రబృందం చెబుతున్నది. మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా విజయ్‌దేవరకొండ ప్రస్తుతం ‘ఫైటర్’ స్క్రిప్ట్‌కు తుదిమెరుగులుదిద్దే పనిలో ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ బిజీగా ఉన్నారు
‘ఫైటర్’కు మార్షల్ ఆర్ట్స్ లో సీరియస్ శిక్షణ
విజయ్ ‘హీరో’ ఆగిపోయింది
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా వెనుకబడిపోయి పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ ‘హీరో’ చిత్రం ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది.
‘డియర్ కామ్రేడ్’ తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో పాటు విజయ్ దేవరకొండ తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘హీరో’ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ను ఢిల్లీలో చిత్రీకరించారు. అయితే ఈ సన్నివేశాల క్వాలిటీ విషయంలో చిత్ర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారట.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో తెరకెక్కించిన రేసింగ్ సీన్స్ ఆకట్టుకునేలా లేకపోవటంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి