‘పరిణీత’ సినిమా చేస్తున్నప్పుడు నాకు నిండా 24 ఏళ్లే. ఆ వయసులోనే నాకు ఒక పెద్ద వయసు మహిళ పాత్ర వేసే అవకాశం వచ్చింది. ఇక, 2018 నాటి కల్లా నేను ఒక నిర్ణయానికి వచ్చేశా. నటించడానికి సవాలుగా నిలిచే పాత్రలు మాత్రమే పోషించాలని తీర్మానించుకున్నా…. అని చెప్పింది విలక్షణ నటివిద్యాబాలన్.
ఆ పద్ధతిలోనే ‘ది డర్టీ పిక్టర్’ లో నటించా. అందులో చేసిన పాత్రకు నాకు జాతీయ అవార్డు రావడంతో చాలా ఆనందపడ్డా. ఆ సినిమా ట్రైలర్ రిలీజైనప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి, నన్ను అలాంటి పాత్రలో చూడాలని తాము అనుకోవడం లేదన్నారు. నిజం చెప్పాలంటే, నాకూ, ఆ ‘డర్టీ పిక్చర్’ చిత్రం ఎవరి జీవితకథ మీద ఆధారపడి తీశారో ఆ నటి సిల్క్స్మితకూ ఏ రకంగానూ పోలికలు లేవు. కానీ, ఆ చిత్ర దర్శకుడు మిలన్ లూథ్రియా నాతో ఒకటే మాట అన్నారు… ‘‘నువ్వు సిల్క్‌కు గౌరవం ఇస్తే, జనం నీ సిల్క్ పాత్రకు గౌరవం ఇస్తారు’’. అంతే. నేను ఆ మాట వేదంలా అనుసరించా. ఫలితంగా, ఆ సినిమాకూ, నా పాత్రకూ ఎంత పేరొచ్చిందో అందరికీ తెలుసు. ‘ది డర్టీ పిక్చర్’ సినిమా వల్ల నాకు జాతీయ అవార్డు మాత్రమే కాదు… నాకు మరో పెద్ద బహుమతి కూడా లభించింది. అది ఏమిటంటే… ప్రతి విషయంలోనూ అతిగా జడ్జమెంటల్గా లేకపోవడమనే వైఖరి అలవాటైంది. ఆ సినిమా నా ఆలోచనా ధోరణిని మార్చేసింది.