ఇరవై సంవత్సరాల క్రితం తెలంగాణ లో ముగ్గురు మహిళల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లవ్ & క్రైమ్ కథే ఈ సినిమా. వి.యఫ్.సి క్రియేషన్స్ పతాకంపై హరి మేఘామ్స్ , రవితేజ, హనీ నటీ నటులుగా కొప్పుల చిన్నయ్యని దర్శకుడిగా పరిచయం చేస్తూ… తునికి హరికృష్ణ నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో వైభవంగా జరిగాయి . ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేణుగోపాల్ చారి, నటుడు రఘు బాబు, దర్శక, నిర్మాత నాగబాల సురేష్ కుమార్, నిర్మాత శ్రీ రంగం శ్రీనివాసు, వైభవ్ తదితరులు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ కొట్టగా, నిర్మాత శ్రీ రంగం శ్రీనివాసులు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. టి.యన్.జి.ఓ ప్రెసిడెంట్ ప్రభాకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్ర దర్శకుడు కొప్పుల చిన్నయ్య మాట్లాడుతూ…. అభ్యుదయంగా ఎదగాలనుకున్న స్త్రీకి పురుషుడు ప్రతిసారి ఎదో రకంగా అడ్డు పడుతూనే ఉంటాడు. అలాంటి సమయంలో వారు ఎలాంటి అవస్థలకు గురవుతున్నారనే కథను రాసుకోవడం జరిగింది.ఈ సినిమాలో బాల్యము, కౌమారం, యవ్వనం దశలలో ముగ్గురు మహిళలు వారి జీవితాలలో ఎదుర్కొన్న యదార్థ కథలను ఈ సినిమాలో తెలియ జేయడం జరుగుతుంది.ఈ సినిమా మొత్తం తెలంగాణ లోని నిర్మల్, ఖానాపూర్, జిన్నారం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది అన్నారు
చిత్ర నిర్మాత తునికి హరికృష్ణ మాట్లాడుతూ… తెలంగాణ లో జరిగిన యదార్థ కథను దర్శకుడు చెప్పిన విధానం, కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. తెలంగాణ సంస్కృతి తికి అద్దం పట్టేలా ఉండే ఈ సినిమా ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది. ఈ సినిమా మొత్తం తెలంగాణలోనే షూటింగ్ జరుపుకుంటుంది. మంచి కథతో ఈ బ్యానర్ లో తీస్తున్న ఈ సినిమా మా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హరి మేఘామ్స్ , రవితేజ, హనీ, డి.యల్. యన్.చారి తదితరులు నటీ నటులు.
మ్యూజిక్ : జయంత్, సినిమాటోగ్రాఫర్ : కంకళ్ళ అశోక్ రెడ్డి
పాటల రచయిత : దాసండ్ల అంజయ్య