‘వెంకీమామ’… మల్టీ స్టారర్ చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న హీరో విక్టరీ వెంకటేష్. ఇటీవల ఎఫ్2 అనే కామిక్ మల్టీ స్టారర్తో అలరించిన వెంకీ త్వరలో ‘వెంకీమామ’ అనే మరో మల్టీ స్టారర్ చిత్రంతో ప్రేక్షకులని అలరించనున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెకక్కనున్న ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. శ్రియా శరన్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించనున్నారు. ఫిబ్రవరి 22న చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని , తొలి షెడ్యూల్ని రాజమండ్రిలో జరపాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. ఈ సినిమాని కోన కార్పోరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడని అంటున్నారు.