వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నారప్ప`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మాతలు. ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.`నారప్ప`షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగిశాయి. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు మేకర్స్.
ఇటీవల సురేష్ ప్రొడక్షన్ వారు ‘ఎస్పీ మ్యూజిక్ లేబుల్’ని ప్రారంభించిన విషయం తెలిసిందే..అందులో మొదటి సినిమాగా`నారప్ప`సాంగ్స్ విడుదలవుతున్నాయి.
డిఫరెంట్ షేడ్స్ ఉన్న సరికొత్త పాత్రలో విక్టరి వెంకటేష్ కనిపించి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ డొంకాడ,కో- ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్