వెంకటేష్ – నాగచైతన్య హీరోలుగా రూపొందుతున్న`వెంకీమామ` చిత్రాన్ని …కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌ను విజయదశమి సందర్భంగా విడుదల చేస్తున్నారు. రిలీజ్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ కలర్‌ఫుల్ పోస్టర్ లో ..ఓ ట్రాక్టర్లో వెంకటేశ్, నాగచైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా ఉన్నారు. ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో వేసిన ఓ భారీ సెట్లో పాట చిత్రీకరణను జరుపుకుంటోంది.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఎడిటర్: ప్రవీణ్ పూడి.