విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్ టైన్మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబందించిన సినిమా తరాల డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. పలువురు సినీ నటీనటుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. 2018 కి సంబందించిన డైరీని నిర్మాత సుఖీభవ ఫిలిమ్స్ అధినేత గురురాజ్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గురురాజ్ మాట్లాడుతూ … విష్ణు బొప్పన చేపట్టిన ఈ కార్యక్రమం ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంది. సినిమా వాళ్లకు సంబందించిన విలువైన సమాచారంతో ప్రతి ఏడాది ఈ డైరీని రూపొందిస్తున్నాడు. 2014 నుండి టివి అవార్డులు అందిస్తున్న ఈ సంస్థ ఈ ఏడాది నుండి సినిమా అవార్డులు అందించేందుకు సిద్ధం అయింది. ఇలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులను టెక్నీషియన్స్ ను ప్రోత్సహించినట్టు అవుతుంది. విష్ణు చేస్తున్న కార్యక్రమానికి చాలా మంది స్పాన్సర్లు రావడం బట్టి చుస్తే అయన చేస్తున్న కార్యక్రమం ఎంత గొప్పతో తెలుస్తుంది. తప్పకుండా ఆయనకు నా సపోర్ట్ ఉంటుంది అన్నారు.
విబి ఎంటర్ టైన్మెంట్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ …ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు సినిమా టివి డైరెక్టరీని 2014 నుండి ప్రచురిస్తున్నాం. అలాగే 2014 నుండి బుల్లితెర అవార్డులు అందిస్తూ వస్తున్నాం. ఈ రోజు 2018 ఫీల్ అండ్ టివి డైరెక్టరీ ని విడుదల చేసాం. ఈ ఏడాది నుండి వెండితెర అవార్డులను అందించాలని నిర్ణయం తీసుకున్నాం. నాకు సపోర్ట్ అందిస్తున్న స్పాన్సర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వారు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నాను అన్నారు.