వరుణ్ తేజ్, పూజ హెగ్డే లతో హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. అధర్వ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం.సెప్టెంబర్ 20న విడుదల కాబోతున్న సందర్భంగా… హైదరాబాద్ శిల్పకళావేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిధి వెంకటేష్ ఆడియో బిగ్ సిడిని విడుదలచేశారు.
వెంకటేష్ మాట్లాడుతూ – ”వరుణ్ ‘ఎఫ్2’లో నా కోబ్రా.. ఈ సినిమాలో పూర్తిగా లుక్ మార్చాడు. గద్దల కొండ గణేష్ రేపు థియేటర్స్‌లో రచ్చే. ‘వాల్మీకి’ ఒక దొంగ మంచిగా మారి రామాయణం రాశారు. మరి ఈ ‘వాల్మీకి’ ఏం రాశాడు? వరుణ్ రెచ్చిపోయి తప్పకుండా సూపర్ బ్లాక్ బస్టర్ ఇస్తాడు” అన్నారు.
గోపి ఆచంట మాట్లాడుతూ – ”వరుణ్‌తేజ్‌తో ఎప్పటినుండో రెండు మూడు సబ్జెక్ట్స్ చేద్దాం అనుకున్నా.. కుదరలేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన కథ.. కమర్షియల్ వాల్యూస్ ఉన్న ‘వాల్మీకి’ చిత్రం ఆయనతో చేయడం హ్యాపీగా ఉంది. అలాగే పూజ, మృణాళిని, అధర్వ,మిక్కీ కి అభినందనలు. దర్శకుడు హరీష్ శంకర్ పవర్ స్టార్‌తో ‘గబ్బర్‌సింగ్’ తీసినట్లే … వరుణ్‌తేజ్ ‘వాల్మీకి’తో అంతకంటే ఎక్కువ అలరిస్తాడు” అన్నారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ – ”ఈ ప్రాజెక్ట్ లో నాతో ట్రావెల్ చేసిన మధు శ్రీనివాస్, మిధుల్ చైతన్య కి థాంక్స్. మిక్కీ పాటలు ఎంత హిట్ అయ్యాయో… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది. వరుణ్ డెడికేషన్, కమిట్ మెంట్ ఉన్నవ్యక్తి. 85 రోజులు షూట్ చేస్తే అన్ని రోజులు నవ్వుతూ చేసిన నా మొదటి హీరో వరుణ్. వరుణ్ చాలా ఈజీగా గద్దల కొండ గణేష్ క్యారెక్టర్ చేశాడు. ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట ఏ రోజు ప్రొడక్షన్ నుండి ‘ఇది లేదు’ అనే మాట రాలేదు. ఒక వారం క్రితం పవన్‌కళ్యాణ్ గారిని కలిసి ట్రైలర్ చూపిస్తే..’చాలా బాగుంది హరీష్’ అన్నారని” అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ” ‘వాల్మీకి’ నా ఫస్ట్ మాస్ సినిమా. మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరు. చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తుండేవారు మాస్ సినిమాల గురించి. ఇప్పుడు అర్ధం అయింది. ఈ సినిమాకు ముఖ్య కారణం హరీష్ శంకర్ గారు. సెట్లో కూడా సూపర్ ఎనర్జీతో ఉండే ఆయన సపోర్ట్. గైడెన్స్ వల్లే ఈ క్యారెక్టర్ బాగా చేయగలిగాను. రామ్ ఆచంట, గోపి ఆచంట ఫుల్ సపోర్ట్ చేసారు. వారితో నా ప్రయాణం కొనసాగుతుంది. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ రీమిక్స్ చేశాం…బాగా వచ్చింది. మిక్కీ ఫస్ట్ టైమ్ మాస్ అదరగొట్టాడు ”అన్నారు.