వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు .ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో హిట్స్‌ను సొంతం చేసుకున్న ‘మెగాప్రిన్స్’ వరుణ్ తేజ్ హీరోగా గురువారం కొత్త చిత్రం ప్రారంభమైంది.
అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్స్.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగబాబు క్లాప్ కొట్టగా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి హీరో వరుణ్ తేజ్… డైరెక్టర్ కిరణ్ కొర్రపాటికి స్క్రిప్ట్‌ను అందించారు.
దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ – “అల్లు అరవింద్‌గారి మార్గదర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. వరుణ్ తేజ్‌గారు కథ వినగానే వెంటనే ఓకే చెప్పారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం …అమెరికాకు వెళ్లి శిక్షణ తీసుకుని వరుణ్‌గారు మేకోవర్ అయ్యారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం , జార్జ్ సి.విలియన్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంకటేశ్‌గారు ఎడిటింగ్ . డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది“ అన్నారు.