వరుణ్ తేజ్ సినిమాలు తన తండ్రి ప్రమేయం లేకుండా స్వయంగా ఎంపిక చేసుకుంటున్నాడని గతంలోనే నాగబాబు తెలిపారు. కొత్తగా, వినూత్నంగా కథలు ఉంటేనే వరుణ్ తేజ్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తను చేసే చిత్రాలు ‘కంచె’, ‘ఫిదా’ తరహాలో ఉండాలని, అటువంటి దర్శకులకు వస్తే తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలోనే వెల్లడించారు వరుణ్. ప్రస్తుతం అలాగే వెళుతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం ‘అంతరిక్షం’, త్వరలో పట్టాలెక్కనున్న ‘ఫన్ అండ్ ప్రస్ట్రేషన్(ఎఫ్2)’కూడా ఈ తరహాలోనివే. తాజాగా సాగర్ చంద్ర అనే దర్శకుడు చెప్పిన కథకు వరుణ్ గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఈ దర్శకుడు గతంలో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చేశారు. ఇప్పుడు ఆయన చేయబోది కూడా అలాగే ఉండనుందని సమాచారం. ఈ చిత్రం 14 రీల్స్ బ్యానర్లో తెరకెక్కనుంది. డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
‘ఘాజీ’ చిత్రంతో నేషనల్ స్టార్డం పొందిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ప్రస్తుతం వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో ఓ సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం వరుణ్ వ్యోమగామిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.ఈ సినిమాలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. దీని కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ టీంను రప్పించారు. ఈ స్టంట్ టీం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు షూటింగ్ జరిగింది. వీళ్లు హీరో వరుణ్ తేజ్‌తో కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో హాలీవుడ్ స్టంట్ యూనిట్‌తో చివరిరోజు తీసుకున్న ఫొటోను వరుణ్ తేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వాళ్లతో కలసి పనిచేయడం మధురమైన అనుభూతి అని వరుణ్ తేజ్ తెలిపారు.
ఈ చిత్రానికి ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ టైటిల్‌ని ఛాంబర్లో కూడా రిజిస్టర్ చేశారని అంటున్నారు. చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్, అదితి రావులు వ్యోమగామిగా కనిపించనున్నారని టాక్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది.