మూడేళ్ల లో ఆరు సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్. ఇక తన తోటి కథానాయకులకు భిన్నంగా వైవిధ్యభరిత పాత్రలు ఎంపిక చేసుకోవడంలో తనదైన శైలి చూపిస్తున్నాడు . చేసిన ప్రయోగాత్మక చిత్రం మిశ్రమ ఫలితాన్నే అందించినా… ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నానికే పూనుకుంటున్నాడు ఆ మెగా ఫ్యామిలీ హీరో. తొలి చిత్రం ‘ముకుంద’ ఫ్లాప్ అయినా మలి చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా ‘కంచె’ సినిమాను చేశాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కు మంచి పేరు తెచ్చినా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది.
‘కంచె’ తర్వాత ‘లోఫర్’, ‘మిస్టర్’ చిత్రాలు కూడా వరుణ్‌కు పెద్ద పరాజయాల్నే మిగిల్చాయి. ఇకశేఖర్ కమ్ముల దర్శకత్వం లో రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ‘ఫిదా’తో భారీ విజయాన్ని చవిచూశాడు వరుణ్ తేజ్. రీసెంట్గా వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా ఈ యంగ్ హీరోకి మంచి సక్సెస్ ను అందించింది. ఇప్పుడు మంచి సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్న ఈ మెగా ఫ్యామిలీ హీరో మరోసారి ప్రయోగాల బాట పడుతున్నాడు. అంతరిక్షం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కే సినిమాలో వ్యోమగామిగా నటించబోతున్నాడు. ‘ఘాజీ’ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించే ఈ సినిమాను ‘కంచె’ మేకర్స్ అయిన క్రిష్, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించబోతున్నారు.సంకల్ప్ రెడ్డి సినిమాలో స్పేస్ ట్రావెలర్‌గా నటించడానికి త్వరలో ఖజకిస్థాన్ వెళ్లబోతున్నాడట వరుణ్ తేజ్. అక్కడ కృత్రిమ జీరో గ్రావిటీ వాతావరణంలో స్పేస్ మూవీకోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటాడట. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు సమాచారం.