వరుణ్ తేజ్ కథానాయకుడిగా “ఘాజీ” చిత్రంతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి ఎదుగురు, రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సంకల్ప్ రెడ్డి తండ్రి సహదేవ్ వీర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా.. చిత్ర కథానాయకుడు వరుణ్ తేజ్ తండ్రి నాగేంద్రబాబు క్లాప్ కొట్టారు. చిత్ర సహా నిర్మాత అయిన క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు.
వరుణ్ తేజ్ ఈ చిత్రంలో వ్యోమగామిగా నటించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సయింటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రం కోసం పలు స్టూడియోల్లో భారీ సెట్స్ వేయడం జరిగింది. వి.ఎఫ్.ఎక్స్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనుంది.
ఫస్ట్ ఫ్రెమ్ సంస్థలో రూపొందుతున్న 6వ చిత్రమిది. ‘కంచె’తో నేషనల్ అవార్డు అందుకున్న రాజీవ్ రెడ్డి-‘ఘాజీ’తో నేషనల్ అవార్డు అందుకొన్న సంకల్ప్ రెడ్డిల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది.
వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని- మౌనిక నిగొత్రే సబ్బాని, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ, డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ, కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి, స్టంట్స్: టోడోర్ లాజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్, ఎస్.ఎఫ్.ఎక్స్: మైష్ త్యాగి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, నిర్మాతలు: రాజీవ్ రెడ్డి ఎదుగురు-రాధాకృష్ణ జాగర్లమూడి(క్రిష్)-సాయిబాబు జాగర్లమూడి, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.