కరోనా గొడవ అలాగే వుంది. థియేటర్లు తెరచుకోనే లేదు. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. కానీ హీరోలు మాత్రం పారితోషికాలు పెంచేస్తున్నారు. టాప్ హీరోల రెమ్యూనరేషన్లు యాభై కోట్లకు చేరిపోతే… మిడ్ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లు పది కోట్లకు చేరుకున్నాయి. యువ హీరో వరుణ్ తేజ్ కూడా ఈ పది కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు.
‘ఎఫ్ 3’ కి ఎనిమిది కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకున్నారని టాక్ వుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఓకె చేసిన సినిమాకు పన్నెండు కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బోగవిల్లి ప్రసాద్ నిర్మించే సినిమాకు పన్నెండు కోట్లు రెమ్యనిరేషన్ అడిగారని, ఆఖరికి వేరే విధంగా ఫిక్స్ చేసారని వినిపిస్తోంది. ఎనిమిది కోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి.. లాభాల్లో వాటా ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయట.
ఇప్పటికే నాని రెమ్యూనిరేషన్ పది కోట్లకు చేరింది. శర్వానంద్, నితిన్ ఇంకా అంతవరకు చేరలేదు. చైతూ కూడా మరీ ఆ రేంజ్ లో డిమాండ్ చేయడం లేదు. సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ తరువాత.. కొత్త సినిమాలు ఏవీ ఇంకా అగ్రిమెంట్ చేయలేదు.
17 కోట్లు అడుతున్నాడట… ఇటీవల ‘నాన్ థియేటర్ రైట్స్ అదనంగా.. బాగా రావడం’ అన్నది నిర్మాతలకు ఆనందం కలిగించింది. కానీ హీరోలు ఆ ఆనందం మిగలకుండా రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారు.వరుణ్ తేజ్ 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడనే వార్త వినిపిస్తుంటే.. సీనియర్ హీరో రవితేజ 17 కోట్లు అడుగుతున్నాడనే వార్త కొత్తగా ప్రారంభమైంది.
ఈ మధ్య హిట్లు లేక చాలా ఇబ్బంది పడ్డ రవితేజ ‘క్రాక్’ తో మాంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు చకచకా సినిమాలు అంగీకరిస్తున్నాడు. రమేష్ వర్మ డైరక్షన్ లో ‘ఖిలాడి’ సగానికి పైగా పూర్తి కావచ్చింది. కొత్త డైరక్టర్ తో సినిమా ఓకె చేసారు. నక్కిన త్రినాధరావు సినిమా కూడా వుంది. వీటి రెమ్యూనరేషన్లు ఇంకా ఫిక్స్ కాలేదు. కొత్తగా ఎవరైనా అడిగితే మాత్రం 17 కోట్లు అడుతున్నాడట.