సమంత అక్కినేని కి ‘టాలీవుడ్ ఉత్తమ కోడలు’ అవార్డు ఇవ్వొచ్చని ఉపాసన అంటున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ‘బి పాజిటివ్'(హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్) మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాగజైన్ కవర్ ఫొటోపై పలువురు సినీ ప్రముఖులు కనిపించారు. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, రామ్ చరణ్, షాహిద్ కపూర్, ఆలియా భట్, కృతి సనన్ తదితరులు దర్శనమిచ్చారు. తమ ఫిట్నెస్ రహస్యాల్ని పంచుకున్నారు. అభిమానులకు ఆరోగ్యం విషయంలో సలహాలు ఇచ్చారు.
ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ ఫొటోపై సమంత కనిపించారు. ఇటీవల దీనికి సంబంధించిన ఫొటోషూట్ జరిగింది. ఉపాసన స్వయంగా సమంతను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఉపాసన ట్విటర్లో షేర్ చేశారు… ‘స్వీటెస్ట్, శక్తిమంతమైన సమంత.. టాలీవుడ్ బెస్ట్ కోడలి అవార్డు ఆమెకే’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు.