పద్మనాయక ప్రొడక్షన్స్ పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `ఉద్యమ సింహం`. నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి పోస్టర్ ను ఆవిష్కరించారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ` ఉద్యమ సింహం టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. కేసీఆర్ గారు నాకు ఇష్టమైన నాయకులు. ఆయనపై ఎంతో ఇష్టంతో దర్శక, నిర్మాతలు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాతలంతా కమర్శియల్ సినిమాలు చేస్తోన్నరోజుల్లో నాగేశ్వరరావు ఆయనపై అభిమానంతో, ఎంతో ఇష్టంతో కేసీఆర్ పై సినిమా చేయడం గొప్ప విషయం. కేసీఆర్ పై సినిమా అనగానే… అంతా ఆయన రాజకీయన నేపథ్యంపై చేస్తున్నారనుకుంటున్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఉండే సినిమా. కేసీఆర్ బయోపిక్ లా అన్ని విషయాలు సినిమాలో చూపిస్తున్నట్లు నాకు చెప్పారు. కొన్ని సీన్స్ చూసాను. చాలా బాగా తీసారు. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. దిలీప్ బండారి సంగీతం బాగుంది. తెలుగు ప్రేక్షకులంతా చిత్రాన్ని ఆదరించాలని ఆశిస్తున్నా. సినిమా సక్సెస్ అయి నిర్మాత మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ, ` జూన్ లో సినిమా ప్రారంభించాం. నేటి (సోమవారం)తో షూటింగ్ పూర్తయింది. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. టెక్నికల్ గాను సినిమా బాగా వస్తోంది. 16న ఆడియా విడుదల చేస్తాం. అతి త్వరలోనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలుగు ప్రేక్షకులు అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం` అని అన్నారు.
చిత్ర దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ` కథ ఎంత బాగో వచ్చిందో..సినిమా కూడా అంతే బాగా వచ్చింది. కేసీఆర్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలో సినిమాలో చూపించబోతున్నాం. సినిమా నిర్మాణానికి నాగేశ్వరరావు గారు ఎక్కడా రాజీపడలేదు. ఎంతో ఫ్యాషన్ తో సినిమా నిర్మిస్తున్నారు. ఈనెల 16న ఆడియో రిలీజ్ చేస్తున్నాం. ఆరోజున కేసీఆర్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు? మిగతా నటీనటులు ఎవరు? అన్నది రివీల్ చేస్తాం` అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి మాట్లాడుతూ,` మొత్తం 5 పాటలున్నాయి. ఉద్యమం సినిమా అని కేవలం ఆ తరహా పాటలే ఉంటాయనుకోవద్దు. కథనుసారం పాటలు ఉంటాయి. ఇదోక ఎమోషనల్ స్టోరీ. తెలంగాణ పెళ్లి నేపథ్యంలోఓ పాట ఉంటుంది. అది సినిమాకు హైలైట్ గా నిలుస్తోంది. ఇకపై తెలంగాణ లో జరిగే ప్రతీ పెళ్లిలో ఆ పాట వినిపించడం ఖాయం. పాట బాగా వచ్చింది. సగం సినిమా ఆర్ ఆర్ కూడా పూర్తయింది. ప్రేక్షకులంతా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
మాటలు రచయిత కృష్ణ రాపోలు మాట్లాడుతూ, ` ఇది నాకు రెండవ సినిమా. కథకు తగ్గట్టు చక్కని సంభాషణలు కుదిరాయి. సినిమా చాలా బాగా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద గర్జించడం ఖాయం` అని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఛాయాగ్రాహకుడు ఉదయ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.
జెన్నీ, సి.హెచ్.పి.విఠల్, ఆకేళ్ల గోపాలకృష్ణ, గిరిధర్, జలగం సుధీర్, మాధవిరెడ్డి, లత నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సి.హెచ్. రాములు, కొరియోగ్రపీ: గణేష్, ఫైట్స్: సూపర్ ఆనంద్, ఎడిటింగ్:నందమూరి హరి, సినిమాటోగ్రఫి: ఉదయ్ కుమార్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రపోలు కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామారెడ్డి పేట రాజశేఖర్, సహనిర్మాత: మేకా రాఘవేంద్ర, కథ, నిర్మాత: కల్వకుంట్ల నాగేశ్వరరావు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అల్లూరి కృష్ణంరాజు.