త్రిష తాజాగా ‘రాంగీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై త్రిష అంచనాలు,ఆశలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.కమర్షియల్ చిత్రాల హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న త్రిష ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల మీద దృష్టి పెట్టింది. నటి నయనతార లా త్రిష చేసిన హర్రర్ కథా చిత్రమే ‘నాయకి’. ఆ చిత్రం త్రిషను పూర్తిగా నిరాశ పరిచింది. ‘మోహిని’ చిత్రంతో మరో ప్రయత్నం చేసినా అదీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు.ప్రస్తుతం ఆ తరహా చిత్రాలే మరో మూడు త్రిష చేతిలో ఉన్నాయి. వాటిలో ‘పరమపదం విళైయాట్టు’, ‘గర్జన’ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతున్నాయి.
త్రిష తాజాగా ‘రాంగీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. కారణం దీనికి కథ, మాటలను ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ అందించడమే. ఆయన శిష్యుడు శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ‘రాంగీ’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.ఇది పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందట. ఫైట్స్ సన్నివేశాల్లో త్రిష డూప్ లేకుండా నటించేస్తోందట. దీని కోసం చాలా కసరత్తులు చేసి తనను మార్చుకుంది కూడా.వచ్చే నెలలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఉజ్బేకిస్తాన్లో చిత్రీకరించనున్నారని తెలిసింది.’రాంగీ’ చిత్రాన్ని సెప్టెంబరు నెలలో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో త్రిష ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.
యాక్షన్ ఎడ్వెంచర్ ‘షుగర్’
సిమ్రాన్, త్రిష ప్రధాన పాత్రధారులుగా సుమంత్ రాధాకృష్ణన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న త్రిష, సిమ్రాన్ చిత్రానికి ‘షుగర్’ అనే టైటిల్ను నిర్ణయించినట్లు తెలిసింది. ఈచిత్రం కథ మంచి కమర్శియల్ ఫార్యులాలో ఉంటుందట. ఇది యాక్షన్ ఎడ్వెంచర్ సన్నివేశాలతో కూడిన చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపాయి. హీరోయిన్లు త్రిష, సిమ్రాన్ అద్భుతమైన సాహసాలు చేస్తున్నారు. వెండితెరపై వారి సాహసాన్ని ఆడియన్స్ ఆస్వాదించడానికి కొంత సమయం ఉంది.ప్రస్తుతం సిమ్రాన్, త్రిషలపై కొన్ని సాహసోపేతమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సిమ్రాన్, త్రిష అక్కాచెల్లెళ్ల పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది విడుదలైన రజనీకాంత్ ‘పేట’ చిత్రం తర్వాత సిమ్రాన్, త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.