సల్మాన్‌ఖాన్ ‘రేస్-3’ ఫిల్మ్‌మేకర్స్ వినూత్న ఆలోచన చేశారు.సినిమా ఎండింగ్‌పై క్లారిటీ లేనప్పుడు రెండు రకాల క్లైమాక్స్‌లు షూట్ చేయడం సహజం. ఎడిటింగ్ సమయంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. కానీ రేస్-3 ఫిల్మ్‌మేకర్స్ వినూత్న ఆలోచన చేశారు. సల్మాన్‌ఖాన్, బాబి డియోల్, అనిల్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా క్లైమాక్స్ లీక్ అవ్వకూడదనే ఉద్దేశంతో మూడు రకాల క్లైమాక్స్‌లు తీశారు. వీటిలో ఏది సినిమాలో ఉంటుందనేది సస్పెన్స్. ఆఖరి నిమిషంలో ముందే నిర్ణయించుకున్న క్లైమాక్స్ పార్టును సినిమాకు జోడిస్తారట. రేస్ సిరీస్ సినిమాలకు క్లైమాక్సే ప్రాణం. ఊహించని ట్విస్ట్‌లతో ముగుస్తాయి ఈ సినిమాలు. రేస్-3 కూడా అందుకు మినహాయింపు కాదు. అలాంటి కీలకమైన క్లైమాక్స్ సీన్ ఏంటనే విషయం రిలీజ్‌కు ముందే ప్రేక్షకులకు తెలిసిపోతే సినిమాపై ఆసక్తి పోతుంది.అలాగే ప్రేక్షకులకు నచ్చే క్లైమాక్స్ సీన్ చివరికి ఓకే చేస్తారట. అందుకే ఇలా మూడు రకాల ముగింపులు షూట్ చేసి సిద్ధంగా పెట్టుకున్నారు. ఇక రేస్-3 చిత్రం జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
‘సల్మాన్ రాసుకున్న పాట ఒకటి ఉంది’
సల్మాన్ ఖాన్‌లోని నటుడు మనందరికీ ఎప్పటినుంచో పరిచయమే. ఆ తర్వాత పెయింటర్‌గా, సింగర్‌గా మారి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తనలో దాగున్న మరో కొత్త టాలెంట్‌ను బయటకు తీశారు సల్మాన్. తాజా చిత్రం ‘రేస్ 3’ కోసం ఆయన పాటల రచయితగా మారారు. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ మధ్యలో వచ్చేఓ రొమాంటిక్ సాంగ్‌ను ఒక ప్రముఖ రచయితతో రాయించాలని చిత్రబృందం చూస్తుంటే ‘నేను రాసుకున్న పాట ఒకటి ఉంది’ అని, తను రాసుకున్న పాటను చదివి వినిపించారట సల్మాన్. టీమ్ అందరికీ ఆ పాట బాగా నచ్చిందట.వెంటనే ఆ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసే పనిలో పడ్డారట సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా. ఈ రొమాంటిక్ సాంగ్‌ను సల్మాన్, జాక్వెలిన్‌పై నృత్యదర్శకుడు రెమో డిసౌజా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. సల్మాన్ లోని ఈ న్యూ టాలెంట్‌ను మనం రంజాన్‌కు వినొచ్చన్నమాట. సల్మాన్ లవర్స్ లిస్ట్ చాలానే ఉంది. సంగీతా బిజలానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, లూలియా వంటూర్.. మరి.. వీళ్లల్లో ఎవరి కోసం సల్మాన్ ఆ రొమాంటిక్ సాంగ్ రాశారో?