ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ .. ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ బాడీ బిల్డర్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆర్నాల్డ్ ‘టెర్మినేటర్’ , ‘కమాండో’, ‘టోటల్ రికాల్’, ‘ప్రిడేటర్’ వంటి హాలీవుడ్ సినిమాలతో ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కాలిఫోర్నియా 38వ గవర్నర్ గా కూడా పదవి బాధ్యతలను నిర్వర్తించాడు. 2011లో ఆర్నాల్డ్ పదవీ విరమణ చేశాడు. అయితే తాను గవర్నర్ గా ఉన్న సమయంలో ఓహియో లోని కొలంబస్ ఏరియాలో ఉన్న ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు. అప్పుడు హోటల్ నిర్వాహకులు తమ హోటల్ ఎదురుగానే ఆర్నాల్డ్ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన ఎప్పుడు తమ హోటల్ కు వచ్చినా.. ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తామని చెప్పారు.
కట్ చేస్తే….. రీసెంట్ గా ఓ పనిమీద ఆ ప్రాంతానికి వెళ్ళిన ఆర్నాల్డ్ హోటల్ లో బస చేసేందుకు రూమ్ కావాలని అడిగాడు. దీనికి హోటల్ సిబ్బంది గదులు ఖాళీగా లేవని సమాధానం ఇచ్చారట. దీంతో కలత చెందిన ఆర్నాల్డ్ హోటల్ ఎదురుగా ఉన్న తన విగ్రహం ప్రక్కనే పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి “కాలం ఎలా మారిపోయింద’నే కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.