‘తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా’ (తాకా) వారి ఆధ్వర్యములో మార్చి 31వ తేదిన శనివారం మిస్సిసాగా నగరంలోని గ్లెన్ ఫారెస్ట్ సెకండరీ స్కూల్ లో ఉగాది వేడుకలు దాదాపు 700 మందికి పైగా హజరైన తోటి తెలుగు వారితో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుక సాంస్కృతిక కమిటీ వాణి, మరియు దీప సాయిరాం ఆద్వర్యంలో అచ్చ తెలుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 5 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను అలరించాయి. పండిట్ దోనేపూడి శర్మ విళంబి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, లక్ష్మి దుగ్గిన గారు ఉగాది పచ్చడి అందరికి అందచేశారు. ఈ కార్యక్రమానికి సందీప్ లయం మరియు సునీల్ సర్వేపల్లి వ్యాఖ్యాతలు గా వ్యవహిరించారు. ఈ కార్యక్రమంలో తోటి తెలుగు మిత్రుడు చల్లా వెంకట్ సహాయార్థం తాకా వారు 2500 వసూలు చేసి అందించారు.
‘తాకా’ కార్యదర్శి నాగేంద్ర హంసాల గారు ఆహ్వానించగా….లక్ష్మి దుగ్గిన, దీప సాయిరాం, జ్యోతి సామంతపూడి మరియు కల్పన మోటూరి జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో దాదాపు వంద మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కూచిపూడి, భరత నాట్యం, కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యాలు, మరియు నాటికలు చిన్న పిల్లల నుండి పెద్దల వరుకు పాల్గొని ప్రేక్షకులను వారి ప్రతిభ సామర్ధ్యాలతో ఉర్రుతలూగించారు. తాకా అద్యక్షులు అరుణకుమార్ లయం తాకా పురస్కారముల ప్రాస్తవ్యాన్ని, తాకా వ్యవస్తాపకతను, ఆవశ్యకతను మరియు భవిష్యత్తు ప్రణాళికను వివరించారు.
తాకా వారు ఉగాది వేడుకల సందర్బంగా గ్రేటర్ టొరంటో ఏరియాలో బారతీయ బాషలు, సంస్కృతి, విద్య, క్రీడలు, సంఘ సేవ మొదలగు విషయాల లో సేవ చేస్తున్న ఆర్నాల్డ్ రామానుజుల మద్దెల (క్రీడలు), సురేష్ నిట్టేల (తెలుగు భాష), లక్ష్మి రాయవరపు (తెలుగు బాష), గిరిధర్ మోటూరి (సంఘ సేవ) ఈ సంవత్సరపు తెలుగు పురస్కారములతో ….తాకా అద్యక్షులు అరుణ్ కుమార్ లయం , ఫౌండేషన్ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ లోకేష్ చిల్లకూరు, వ్యవస్థాపక సభ్యుడు శ్రీనాథ్ కుందూరు, పూర్వ అద్యక్షులు గంగాధర్ సుఖవాసి, చారి సామంతపూడి, ఉపాద్యక్షులు రామచంద్ర రావు దుగ్గిన, కార్యదర్శి నాగేంద్ర హంసాల, కోశాధికారి శ్రీమతి కల్పన మోటూరి మరియు తానా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ సూరపనేని గార్లు సత్కరించారు. తాకా కార్యవర్గపు సభ్యులు సురేష్ కూన, వాణి సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్న వారికి, మరియు తాకా దాతలను జ్ఞాపికలతో సత్కరించారు. తాకా ఉగాది వేడుక ప్రత్యేకదాత వెంకట్ పెరుగు తాకా కార్యవర్గం అభినందించి జ్ఞాన దీపిక అంద చేసారు. తాకా వారు ప్రత్యేకంగా తయారు చేపించిన పిండివంటలతో ఉగాది విందుని ఏర్పాటు చేసారు.ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతము చేసిన తాకా ఫుడ్ కమిటీ ఇంచార్జి సురేష్ కూన, కల్పనా మోటూరి, రాఘవ అల్లంల ను మరియు కిరణ్ కాకర్లపూడిని, కల్చరల్ ఇంచార్జి దీప సాయిరాం మరియు వాణి ని తాకా అద్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమం లో తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరి, గంగాధర్ సుఖవాసి, చారి సామంతపూడి లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.