రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. రమేష్ గోపీ దర్శకులు. ఎస్.వి.ప్రకాష్ నిర్మాత. హీరో తరుణ్ పుట్టినరోజు సందర్భంగా.. హీరో తరుణ్ ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా…
చిత్ర నిర్మాత ఎస్.వి.ప్రకాష్ మాట్లాడుతూ – ”హీరో తరుణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా కోసం వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేస్తున్నాం” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్ మాట్లాడుతూ – ”తెలుగులో నా తొలి చిత్రమిది. సినిమాకు మంచి సంగీతం, రీరికార్డింగ్ కుదిరింది. మంచి సినిమాకు పనిచేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు మాట్లాడుతూ – ”సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.
డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ – ”తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మనసున్న మనుషులందరికీ ఫిబ్రవరి 14న విడుదలయ్యే ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. తరుణ్ గత హిట్ చిత్రాలు ‘నువ్వే కావాలి’, ‘నువ్వే నువ్వే’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుందని గర్వంగా చెప్పగలను” అన్నారు.
దర్శకుడు గోపి మాట్లాడుతూ – ”నాగార్జునగారు విడుదల చేసిన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్‌కి కూడా అలాంటి రెస్పాన్సే వస్తుందని భావిస్తున్నాను. అంజలి, నువ్వేకావాలి కంటే ఈ సినిమా తరుణ్‌కి పెద్ద హిట్‌గా నిలుస్తుంది. సినిమాను చూసే ప్రేక్షకుడు ఇది నా లవ్‌స్టోరీ అని తప్పకుండా ఫీల్ అవుతాడు” అన్నారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ – ”నాపుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. నాగార్జునగారు టీజర్‌ను విడుదల చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. టీజర్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. రెగ్యులర్ ప్రేమకథ కాదు. ఇందులో మూడు గెటప్స్‌లో నేను కనపడి ఉంటాను. మరి ఇందులో ట్రిపుల్ రోల్ చేశానా? లేదా మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేశానా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, మంచి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని చక్కగా అమరాయి. హీరోయిన్ ఓవియా చాలా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు కూడా కనపడవు. ఓవియాతో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశాను. గోగినేని బాలకృష్ణగారు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. అలాగే ట్రెండీ మూవీస్ సంస్థ సినిమాను యు.ఎస్‌లో విడుదల చేస్తుంది” అన్నారు.
తరుణ్, ఓవియా, ఖయ్యుమ్, చిట్టిబాబు, జగదీష్, అనిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, రమేష్ గోపి, రామాంజనేయులు, రవికిరణ్, ఆర్ట్: జె.కె.మూర్తి, ఎడిటర్: శంకర్, సినిమాటోగ్రఫీ: క్రిస్టోపర్ జోసెఫ్, మ్యూజిక్: శ్రీనాథ్ విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జగదీశ్.ఎస్, అరుణ్ అజాద్, కో ప్రొడ్యూసర్: ఎ.గణేశ్, నిర్మాత: ఎస్.వి.ప్రకాష్, దర్శకత్వం: రమేష్ – గోపి.