యంగ్ హీరో తనీష్ ‘దేశదిమ్మరి’ గా ముస్తాబౌతున్నాడు. సవీన క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలొ స్వతంత్ర గోయల్ (శావి USA) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేశదిమ్మరిలో తనీష్ కు జోడీగా షరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ కానుకగా విడుదలకు ముస్తాబౌతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది . ఈ చిత్రంతో తనీష్ తనలోని గాయకుడిని మనకు పరిచయం చేస్తున్నాడు. హే పైసా అంటూ డబ్బు పై వచ్చే ఓ సెటైరికల్ సాంగ్‌ని తనీష్ స్వయంగా ఆలపించాడు. ఈ చిత్రాన్ని పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ , హర్యానా, సిమ్లా వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. దేశదిమ్మరి చిత్రానికి సుభాష్ ఆనంద్ అందించిన సంగీతం , ప్రదీష్ ఆంటోని కొరియోగ్రఫీ రెండు హైలైట్ గా ఉంటాయని చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి చెప్పారు.
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ముస్తాబౌతున్న తమ దేశదిమ్మరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని,చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోందని. సమ్మర్ లొనె ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా , మల్లిఖార్జున్ సినిమాటోగ్రఫీని అందించారు.
Tanish is all set to enthrall us as Desa Dhimmari
Young hero Tanish is all set to enthrall us as Desa Dhimmari. Nagesh Naradasi is directing the film, while Swatantra Goel (Savi USA) is producing it on Saveena Creation Banner. Shareen is leading lady opposite Tanish in the film.
The film will go for censor soon and it is slated for release in this summer. Tanish is going to show us his singing skills with the film. Yes, Tanish crooned a satirical song on cash ‘Hey Paisa’ in this film.
Desa Dhimmari has been shot in beautiful locations in Punjab, Himachal Pradesh, Haryana, Simla etc. Director Nagesh Naradasi informed that, Subhash Anand’s music and Pradeep Antony’s choreography will be major highlights in the film.
“Desa Dhimmari is made as pucca commercial entertainer with all ingredients for all section of audiences. The film has done with production works and it will soon complete censor formalities. We are planning to release the movie in summer,” said producer.
Nandamuri Hari is the editor and Mallikarjun cranked cinematography.