విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమసోమా జ్యోతిర్గమయ’. ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. గుణ ఎంటర్టైమెంట్స్ సమర్పణ.’మల్లేశం’, ‘కాంచివరం’ తరహాలో చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ యువ దర్శకుడు విజయ్ కుమార్ బడుగు రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా పద్మజ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల అవుతున్న సందర్బంగా… తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ట్రైలర్ ని విడుదల చేశారు.
దర్శకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ … పోచంపల్లి పరిసరాల్లోనే పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న ‘తమసోమ జ్యోతిర్గమయ’ లో 2001 నుంచి 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవన స్థితిని చూపించబోతున్నాం. ఈ కథను నమ్మి నాకు సపోర్ట్ అందించిన నిర్మాత తడక రమేష్ గారికి… గుణ ఎంటర్ టైనేమెంట్స్ కార్తీక్ గౌడ్ గారు వరల్డ్ వైడ్ గా సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చినందుకు వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్, శ్రావణి చాలా చక్కగా నటించారు. చాలా మంచి కథ, నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు.
నిర్మాత తడక రమేష్ మాట్లాడుతూ … ఈ సినిమా విషయంలో నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా విషయంలో కూడా నాకు చాలా నమ్మకం కలగడానికి కారణం గుణ ఎంటర్ టైనేమేంట్ కార్తీక్ గారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్న రుషిక మేడం కు కూడా థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఇది చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారి కథ. వారి జీవితాల నేపథ్యంలో తెరకెక్కించాం. మారుతున్న కాలాన్ని బట్టి చేతివృత్తుల వాళ్ళు కూడా మారగలిగితే చాలా మంది కి ఉపాధి దొరుకుంటుంది అని చెప్పడం మా ఉద్దేశం .అలాగే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన మంత్రి కేటీఆర్ సినిమా ట్రైలర్ చూసి చాలా బాగుంది. ఈ సినిమా విషయంలో మీకు నేను సపోర్ట్ ఇస్తానని అన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
సహ నిర్మాత సాయి కార్తీక్ మాట్లాడుతూ… ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా చూసాక బాగా నచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నాం. నిజంగా ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి. మన నిజజీవిత కథలు ఇవి. ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయన్న నమ్మకంతో ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నాం . ఇప్పటికే అమెరికాలో ఎనిమిది సెంటర్స్ ఓకే అయ్యాయి. నేటి తరానికి ఇలాంటి చేనేత కళలు, చేనేత రంగంలోని వ్యక్తుల జీవితాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఈ నెల 29న ఈ సినిమా విడుదల అవుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : మార్క్ కె ప్రశాంత్ ,కెమెరా : శ్రవణ్ జీ కుమార్.