‘‘మా అమ్మకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తను భక్తురాలు. మా అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నాను. ఈ మధ్య తరచూ తనతో కూర్చుని ఆధ్యాత్మిక గ్రంధాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అమ్మ చదివినంత వేగంగా నేను చదవలేను. కానీ, నాకు వీలైనంత వేగంగా చదువుతూ… అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను. భక్తి బాటలో అడుగులు వేస్తున్నాను’’ అని తమన్నా తెలిపారు.
‘‘కొన్ని కారణాల వల్ల నా మాతృభాష సింధీపై ఇప్పటివరకు సరైన పట్టు సాధించలేకపోయాను. దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నందువల్ల తెలుగు, తమిళ భాషలను బాగానే మాట్లాడగలుగుతున్నాను. హిందీ కూడా వచ్చు. ఈ లాక్‌డౌన్ సమయంలో సింధీ భాషను నేర్చుకుంటున్నాను. మా అమ్మగారితో ప్రస్తుతం ఆ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను.
తమన్నా ప్రస్తుతం సంస్కృతీ సాంప్రదాయలు తెలుసుకొనే పనిలో ఉన్నారు. అలాగే, సాంప్రదాయ వంటలు స్వయంగా చేయడం, వడ్డించడం కూడా తమన్నా నేర్చుకుంటున్నారు. వృత్తిపరంగా బిజీగా ఉండటం వల్ల నేనెక్కువగా ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉండటం నాకు కొత్తగా ఉంది. ఖాళీ సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
కబడ్డీ కోచ్‌గా ‘సీటీమార్’
లాక్‌డౌన్‌లో తమన్నా ఫిట్‌నెస్‌ను కోల్పోకుండా డిజిటల్ వర్కౌట్లు చేస్తున్నారు. అంతేగాక వంటలు చేస్తూ .. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముంబై భామ ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. గోపీచంద్ హీరోగా కబడ్డీ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సంపతి నంది దర్శకత్వంలో ఇప్పటికే ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల్లో తమన్నా పనిచేశారు.
ఆ విషయంలో రాజీ లేదట!
మిల్కీ బ్యూటీ తమన్నా రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గరని టాక్ .ఆఫర్లు తక్కువగా ఉన్న సమయంలో హీరోయిన్లు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటారు. ఈ విషయంలో కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటారు. కానీ తమన్నా రెమ్యూనరేషన్ విషయంలో రాజీ లేదట. రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ అందాల భామ… రెమ్యూనరేషన్ విషయంలో తేడాలు రావడంతో ఈ సినిమాకు టాటా చెప్పినట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.