ఆమె స్పీడ్ చూసి అందరూ షాక్ !…. తమన్నా ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంది .ఆమె స్పీడ్ చూసి మిగిలిన హీరోయిన్లు అందరూ షాక్ అవుతున్నారు. ఏదైనా కూడా 15 ఏళ్ల అనుభవం తర్వాత కూడా ఇన్ని అవకాశాలు అందుకోవడం తమన్నాకు మాత్రమే సాధ్యమవుతుంది. తమన్నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన అనుష్క, త్రిష లాంటి వారు ఇప్పటికే బ్యాగ్ సర్దేసి అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్నారు. కానీ తమన్నా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ మిల్కీ బ్యూటీ. తాజాగా సత్యదేవ్ లాంటి యంగ్ హీరోతో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తుంది. ఇమేజ్ లో తన కంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉన్న సత్యదేవ్ లాంటి అప్ కమింగ్ హీరోతో నటించడానికి ఎలాంటి ఈగో చూపించడం లేదు .
అంతేకాదు వెబ్ సిరీస్ లతో కూడా బిజీ అయిపోయింది తమన్నా. ఇప్పటికే ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది తమన్నా. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. దాంతో పాటు ఈమె చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగులో గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘సీటీ మార్’ లో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. దాంతో పాటు నితిన్ హీరోగా వస్తున్న ‘అంధాధున్’ రీమేక్ లో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూడు సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
తెలుగుతోపాటు తమిళం, హిందీలో కూడా తమన్నాకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా చేస్తానని దర్శక నిర్మాతలకు చెప్పింది తమన్నా. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుండటంతో రొమాన్స్ బాగా మిస్ అవుతున్నాను అంటోంది తమన్నా. మళ్లీ అలాంటి సబ్జెక్టులు చేయాలని ఉందని మనసులో మాట చెప్పింది ఈ ముద్దుగుమ్మ.