‘గాసిప్స్ మంచివే !’… అంటోంది తమన్నా .గాసిప్స్ చదవడం తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. నటిగా దశాబ్దాన్ని దాటేసిన తమన్నా గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ ప్రచారం. తమన్నాకు అవకాశాలు లేవని, ఫ్లాప్‌ల నటి అని, ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందేనంటూ రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది.
అయితే ఇలాంటి ప్రచారానికి మరొకరైతే బాధ పడడమో, ఫైర్ అవడమో జరుగుతుంది. కానీ ఈ పంజాబీ బ్యూటీ కాస్త భిన్నం.గాసిప్స్ మంచిదే అంటోంది. అందుకు కారణం కూడా చెబుతోంది. నా నట కెరీర్ అంతం కాబోతోంది లాంటి ట్విట్స్, గాసిప్స్ వంటివి చదవడం తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. ‘నాపనైపోయింది’ అని అన్నప్పుడల్లా తనకింకా ఉత్సాహం కలుగుతోందని అంది.
ఎందుకంటే, అప్పుడు తానింకా కొత్త నటిగా ఫీల్ అవుతానని చెప్పింది. అది తనకు ఇంకా శ్రమించేలా చేస్తుందని పేర్కొంది. అయినా అలాంటి ఫ్లాప్ ముద్రలో తాను ఉన్నప్పుడే ‘బాహుబలి’ చిత్ర అవకాశం వచ్చిందని పేర్కొంది. ఒక నటిగా ‘నట జీవితం ఇక చాలు’ అని భావించినప్పుడే తన వృత్తి పరమైన జీవితం ముగుస్తుందని అంది. అయితే తనలోని నటికి మాత్రం ఎప్పటికీ విశ్రాంతి ఉండదని నటి తమన్నా పేర్కొంది.
తమన్నా ఉదయనిధితో నటించిన ‘కన్నే కలైమానే’ చిత్రంలో నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవాతో ‘దేవి–2’ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఇక త్వరలో నటుడు విశాల్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా తెలుగులోనూ అవకాశాలు ఆశాజనకంగానే ఉన్నాయి.ఈ పంజాబీ బ్యూటీ వదంతులను ఎంజాయ్ చేస్తూ మరింత ఉత్సాహంతో నటించేస్తోంది. ఎఫ్ 2 తో పెద్ద హిట్ కొట్టిన తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ త్వరలో విడుదల కానుంది.