ఎస్వీ.కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత ‘ఆర్గానిక్ మామ. హైబ్రీడ్ అల్లుడు’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా మజిలీ ఫేమ్ అనన్య హీరోయిన్. డా.రాజేంద్ర ప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.అమ్ము క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్ హీరోయిన్ అనన్య లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మీడియా సమావేశంలో డా.రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్, హీరోయిన్ అనన్య, ఎస్వీ కృష్ణ రెడ్డి, నటులు సునీల్, వరుణ్ సందేశ్, వైవా హర్ష, జబర్దస్త్ రాఘవ, అప్పారావు, నటి హేమ, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, చిత్ర నిర్మాత కోనేరు కల్పన, హీరో సత్య దేవ్,, ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు,శివరామ్ కృష్ణ, జెమిని కిరణ్, ఏ ఎం రత్నం, బేక్కం వేణుగోపాల్, డైరెక్టర్ రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ నుండీ జర్నీ చేస్తున్నాను. ఇవాళ కృష్ణారెడ్డి గారి సినిమా ప్రారంభం అయింది. కృష్ణారెడ్డి గారు కూడా అంతకుమించిన జోష్ తో వున్నారు. మంచికథతో కల్పనా గారు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. సి. కళ్యాణ్ గారు కొండంత అండగా వుండి ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. నేను ఎలా అయితే ఆలోచిస్తానో నాకంటే బెటర్ గా కల్పన గారు ప్లాన్ చేసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.సోహైల్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. వరుణ్ సందేశ్ పాత్ర కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కుష్బూ, సూర్య, హేమ, సునీల్, ఆలీ చాలా మంది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రష్మీ ఒక గ్లామరస్ పాత్రలో నటిస్తుంది. అందరికి నచ్చే సినిమా అవుతుంది అన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్టర్ గా సినిమాలు తీసేప్పటినుండి నేను సినిమా చేయమని అడిగే వాడ్ని. అయన చేద్దాం సార్ అనేవాడు. ఇప్పటికి మా వైఫ్ కల్పన ద్వారా ఆ కోరిక తీరింది. ఈ సినిమా సోహైల్ కి దక్కడం అతని అదృష్టం. సునీల్, వరుణ్ సందేశ్ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కృష్ణారెడ్డి గారు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసేంత బిజీ అవుతారు అన్నారు.
నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “కృష్ణారెడ్డి నాతో కొబ్బరి బొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, వంటి సూపర్ హిట్ చిత్రాలను తీశారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటిచడం చాలా హ్యాపీగా వుంది.కామిడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి అన్నారు.
చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. అచ్చిరెడ్డి గారి సలహా మేరకు కల్పన గారు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. సి.కళ్యాణ్ గారిది వెరీ గుడ్ అండ్ బిగ్ హ్యాండ్. సోహైల్, అనన్య చక్కగా సెట్ అయ్యారు అని అన్నారు.
హీరో సోహైల్ మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణా రెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి నా థాంక్స్. రాజేంద్రప్రసాద్ వంటి లెజండ్రీ యాక్టర్ తో చేయడం నా అదృష్టం అన్నారు.
సునీల్ మాట్లాడుతూ.. నేను లైఫ్ లో ఫస్ట్ కలిసిన వ్యక్తి డైరెక్టర్ గా కృష్ణరెడ్డి గారు. ప్రొడ్యూసర్ గా అచ్చిరెడ్డి గారు. మళ్ళీ వాళ్ళ సమక్షంలో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇప్పటివరకు నేను చేయనటువంటి క్యారెక్టర్.. చాలా వెరైటీ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేస్తున్నాను అన్నారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. కృష్ణారెడ్డి గారి సినిమాలు చిన్నప్పటినుండి చూస్తున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్; ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్. ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర, సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, ఫైట్స్ :వెంకట్, స్టిల్స్: మనిషా ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఉదయ్ భాస్కర్, చీఫ్-అసోసియేట్ డైరెక్టర్: సెల్వ కుమార్.