కల్పన చిత్ర బేనర్‌పై కల్పన కోనేరు నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సోహెల్, మృణాళిని రవి జంటగా డా. రాజేంద్రప్రసాద్, మీనా, అలీ, సునీల్ ప్రధాన తారాగణంతో రూపొందుతోన్నఈ చిత్రం షూటింగ్ లో ఎస్.వి. కృష్ణారెడ్డి జన్మదిన వేడుక చిత్ర యూనిట్ సమక్షంలో ఆహ్లాదరకంగా జరిగింది.
సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమాలు ఎన్ని చేసినా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓహో’ అనిపించుకునేలా కాకుండా.. ‘బాగుంది’ అంటే సూపర్ హిట్. ఎస్.వి. కృష్ణారెడ్డి అలాంటి కథను ఎన్నుకున్నారు. ఈ సినిమా ఆయనకు గొప్ప మలుపు కావాలని కోరుకుంటున్నాను. ఎస్.వి. కృష్ణారెడ్డి తో 38 ఏళ్ళ జర్నీ, మా జర్నీ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకముంది అన్నారు.
కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టు మిత్రులు, చిత్ర యూనిట్ సమక్షంలో ఎస్.వి. కృష్ణారెడ్డి జన్మదిన వేడుక జరగడం ఆనందంగా వుంది. ప్రతి ఏడాది వచ్చే పుట్టినరోజు ఆత్మీయుల సమక్షంలో జరుపుకోవడంలో ఆనందం వేరుగా వుంటుంది. ఈ చిత్ర కథ నచ్చి ఎస్.వి.కృష్ణారెడ్డిగారు సినిమా తీయడానికి కారణమైంది. అందుకు కల్పనగారు ఎంతో ప్రోత్సహించారు. సోహెల్ హీరోగా బాగా చేస్తున్నాడు. మృణాళిని రవి మంచి నటి. చాలా నాచురల్‌గా చేస్తుంది అన్నారు.
నిర్మాత కల్పన మాట్లాడుతూ… మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. సెట్లో వున్న ప్రతివారూ తల్లిగా భావించి నేను తిట్టినా భరిస్తున్నారు. అందరూ మంచి సహకారం అందిస్తున్నారని తెలిపారు.
ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ… నాకు అచ్చిరెడ్డిగారి లాంటి వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. నన్ను దిశానిర్దేశం చేసింది ఆయనే. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా ప్రతిక్షణం నా భవిష్యత్ గురించే ఆలోచిస్తారు. ఐదేళ్ళ నుంచి ఐదు కథలు రాసుకున్నాను. అలా రాయడానికి కారణం అచ్చిరెడ్డిగారే. ఇక నిర్మాతగా ఎవరు అని ఆలోచిస్తుండగా, దేవుడు అదృష్టాన్ని కల్పన గారి రూపంలో పంపాడు. ఆమె మంచి నిర్మాత. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం చేస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను నిరంతరం కష్టపడుతూనే వుంటాను. అది నా నైజం.
నేను కమిట్మెంట్తోనే సినిమా తీస్తాను. ఆడవారిని కించపరిచేవిధంగా అస్సలు తీయను. కొందరు వచ్చి నన్ను ఆ మార్గంలో చేయమన్నారు. వద్దని అచ్చిరెడ్డిగారు చెప్పారు. మన శైలిలో వెళితే ఎప్పుడో ఒకప్పుడు మార్గం దొరుకుతుంది అన్నారు. ఆయన నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. కథ రాసుకున్నాక అద్భతం అన్నారు. మాటలు బాగున్నాయన్నారు. సంగీతం చేశాను. కసితో మంచి సినిమా ఇవ్వాలనే తపిస్తున్నాను. నన్ను నేను దర్శకుడిగా నిలబడడానికి ఎంత శ్రమ చేశానో ఇప్పుడు అదే తపనతో చేస్తున్నాను.
40 సినిమాలు చేసిన అనుభవం. ఇంగ్లీషులోనూ సినిమా చేశాను. యు.ఎస్. డైరెక్టర్ అసోసియేషన్‌లో నేను మెంబర్‌ను. అందుకే మీకోసం మిమ్మల్ని నవ్వించడానికి సినిమా చేశాను. అందుకు హీరోగా సోహెల్ ను ఎంచుకున్నాను. కామెడీ, సెంటిమెంట్, ఫైట్స్, డాన్స్ బాగా చేస్తున్నాడు. కమర్షియల్ హీరో లక్షణాలున్నాయి. మృణాళిని రవి మంచి నటి. సున్నితమైన భావాలన్ని బాగా పలికిస్తుంది. ఇంతమందిని అందంగా చూపించడానికి రామ్ ప్రసాద్ సిద్దంగా వున్నాడు. ప్రతి సినిమాను బాగా మలచాలనే తపన ఆయనలో వుంది అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నా టాలెంట్‌ను దర్శకుడు బయటపెడుతున్నారు. చిన్న సీన్ కూడా చేసి మరీ చూపిస్తున్నారు. అలా కొంతమంది దర్శకులే వుంటారు. ఎస్.వి.కృష్ణారెడ్డిగారికి థ్యాంక్స్. లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. నిర్మాత కల్పనగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్రజలకు ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలనే కసితోనే అందరం చేస్తున్నాం. అచ్చిరెడ్డిగారు లొకేషన్‌కు వస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మృణాళిని నేచురల్ నటి అని చెప్పారు.
మృణాళిని రవి మాట్లాడుతూ… ఈ సినిమా నాకు రావడం లక్కీగా భావిస్తున్నా. లెజండరీ దర్శకుడుతో పనిచేస్తున్నందుకు ఆనందంగా వుంది. సెట్లో చాలా కూల్‌గా వుంటారు. చిన్నచిన్న మూవ్మెంట్స్ బాగా డీల్ చేస్తారు. ఆయనలో గొప్ప నటుడు వున్నారు. నిర్మాత కల్పనగారు కుటుంబసభ్యులా చూస్తున్నారు. అందరూ మంచి ఎనర్జీతో పనిచేస్తున్నారని అన్నారు.