మహేష్ బాబు తన స్వస్థలం బుర్రిపాలెంను, తెలంగాణలో సిద్దాపూర్ను దత్తత తీసుకున్న విషయం విదితమే. సిద్దాపూర్ గ్రామాన్ని మహేశ్ భార్య నమ్రత చూసుకుంటున్నారు.
“ఊరిని దత్తత తీసుకోవడమంటే.. జేబులో డబ్బులు తీసి.. రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోతాననుకున్నార్రా? వీడిని, వాడిని, వాడిని.. వీళ్లందరినీ.. నిన్ను.. మొత్తాన్ని దత్తత తీసుకున్నా.” ఇది మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ చెప్పేసి మహేష్ చేతులు దులుపుకోలేదు. నిజ జీవితంలోనూ ఈ డైలాగ్‌ను నిజం చేశారు.
తెలంగాణలో దత్తత తీసుకున్న సిద్దాపూర్ గ్రామాన్ని మహేష్ భార్య నమ్రత చూసుకుంటున్నారు. బుర్రిపాలెంలో ఆ తర్వాత తన బావ, ఎంపీ గల్లా జయదేవ్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రతి నెలా బుర్రిపాలెంలో ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్స్ జరుగుతుంటాయి. వీటిలో భాగంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే 99మంది చిన్నారులను గుర్తించారు. వారిందరికీ ఆరు క్యాంపులు నిర్వహించి, ఆపరేషన్లు చేయించి, ప్రాణదాతగా మారారు ఈ రీల్ అండ్ రియల్ లైఫ్ హీరో. తాజాగా గుండె సంబంధిత ఆపరేషన్లు నిర్వహించిన చిన్నారుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆంధ్రా హాస్పిటల్స్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు మహేష్.