నటి.. గృహిణి.. సామాజిక కార్యకర్తగా

‘పోర్న్‌స్టార్‌’గా ప్రపంచవ్యాప్తంగా పాపులరై ఆతర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తన సత్తాచాటిన హాట్ బ్యూటీ సన్నీలియాన్. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సన్నీలియాన్‌లో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి. సన్నీలియాన్ 2011లో డానియల్ వెబర్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ చక్కగా కాపురం చేస్తూ కలిసే ఉంటున్నారు. ఒక పోర్న్ స్టార్ ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో కాలంగా కలిసి ఉండటం అన్నది చాలా అరుదుగా కనిపిస్తుంది.
 
ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉందని అంటోంది సన్నీలియాన్. ఇక ఛారిటీ సంస్థలకు, సామాజిక సంస్థలకు సన్నీ ప్రచారకర్తగా ఉంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తోంది. అమెరికా క్యాన్సర్ సొసైటీకి, పెటా సంస్థకు సన్నీ తన సేవలను అందిస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. ముంబైలోని ఓ పాఠశాలను దత్తత తీసుకొని ఆ స్కూల్‌కు కావల్సిన వసతులను సమకూరుస్తోంది. సన్నీలియాన్ ఓ మంచి చెఫ్ కూడానట. ఇంట్లో ఉన్నప్పుడు తన భర్త వెబర్‌కు తానే స్వయంగా వంటచేసిపెడుతుందట. అంతటి అన్యోన్య దాంపత్య జీవితం వారిద్దరిది. వంట చేయడమంటే ఒక మహిళగా తనకు చాలా ఇష్టమని చెబుతోంది. ఇలా సన్నీలో ఒక మంచి గృహిణి, ఒక మంచి సామాజిక కార్యకర్త, మంచి నటి ఉండడం విశేషమే మరి.
ట్రోల్స్ చేస్తున్నవారికి ధన్యవాదాలు
సన్నీలియోని తాజాగా అర్బాజ్‌ఖాన్ వెబ్ షో ‘పించ్‌’లో తళుక్కున మెరిసింది. పించ్‌లో సందడి చేసిన సన్నీలియోని ప్రివ్యూ వీడియోను అర్బాజ్‌ఖాన్ అభిమానులతో పంచుకున్నాడు. కొత్త అతిథిని పరిచయం చేస్తూ..’ఎస్ ఫర్ స్ట్రాంగ్. ఎస్ ఫర్ @ సన్నీలియోని’ అని ట్వీట్ చేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎపిసోడ్‌లో సన్నీలియోని తన గతం గురించి మాట్లాడిందట. గతంలో అడల్ట్ యాక్టర్‌గా నటించడం, హిందీ సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత కెరీర్ ఎలా సాగుతోంది…అన్న విషయాలు చెప్పిందట.
 
“ఆ సమయంలో నాకు ఉత్తమమైనవనిపించిన నిర్ణయాలు తీసుకున్నా”నంటూ ప్రీవ్యూలో చెప్పింది సన్నీ. అంతేకాదు సోషల్‌మీడియాలో తనపై ట్రోల్స్ చేస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపింది. నన్ను ట్రోలింగ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే నా పేజ్‌లో మీరు ఎంత సమయం కేటాయిస్తారో నాకు తెలుసు.. అంటూ ట్రోలింగ్ చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేసింది. అర్బాజ్ ఖాన్, సన్నీలియోని ‘తేరా ఇంతజార్’ సినిమాలో కలిసి నటించారు. ఈ ఇద్దరి చిట్ చాట్ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.