ఎమ్ ఎస్ కె ప్రమిద శ్రీ ఫిలింస్ పతాకంపై కృష్ణ సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తోన్న రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ `సుందరాంగుడు`. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో
దర్శకుడు ఎమ్.వినయ్‌బాబు మాట్లాడుతూ…“ హీరో జమీందార్ కుటుంబంలో పుట్టడంతో అందంగా లేకున్నా అమ్మాయిలు అతని ధనం చూసి ప్రేమిస్తారు. ఈ నేపథ్యంలో హీరో సాధారణ యువకుడుగా మారి బయట ప్రపంచంలోకి వస్తాడు..కానీ అమ్మాయిలంతా అతణ్ని అసహ్యించుకుంటారు. అలా అసహ్యించుకున్న అమ్మాయిలను ఎలా వశపరుచుకున్నాడు. చివరకు తనను ఎంతగానో ఇష్టపడే మరదలి ప్రేమను ఒప్పుకున్నాడా? లేదా అన్నది సినిమా కథాంశం. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా, ఆహ్లాదంగా ఉంటుంది. త్వరలో దుబాయ్ లో చేయబోయే పాటతో సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుంది. సిద్ధబాపు ఐదు అద్భుతమైన పాటలందించారు“ అన్నారు.
నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ…“దర్శకుడు వినయ్ బాబు నాకు చాలా కాలం నుంచి పరిచయం. తను చెప్పిన `సుందరాంగుడు` కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. హీరో కృష్ణ సాయి గతంలో తమిళ్ , తెలుగులో పలు సినిమాలు చేసారు.అలాగే హీరోయిన్ మౌర్యాని కూడా చాలా తెలుగు సినిమాల్లో నటించారు. ఇందులో హీరో హీరోయిన్స్ క్యారక్టర్స్ చాలా బాగా డిజైన్ చేసారు దర్శకుడు. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వస్తోంది. నిర్మాతలుగా మాకిది తొలి సినిమా కావడంతో దర్శకుడు వినయ్ బాబు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. `సుందరాంగుడు` చిత్రం నిర్మాతలుగా మాకు మంచి గుర్తింపు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాం“ అన్నారు.
హీరో కృష్ణసాయి మాట్లాడుతూ..“ దర్శకుడు వినయ్ గారు ఓ వినూతమైన కాన్సెప్ట్ తో `సుందరాంగుడు` సినిమా చేస్తున్నారు. నా క్యారక్టర్ అద్భుతంగ డిజైన్ చేసారు. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు“ అన్నారు.
హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ…“పర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జూ.రేలంగి, మిర్చి మాధవి, సినిమాటోగ్రాఫర్ వెంకట హనుమ తదితరులు పాల్గొన్నారు.