శ్రీరెడ్డి… ‘క్యాస్టింగ్ కౌచ్’పై పోరాడుతున్న వర్ధమాన నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. గత కొంతకాలంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల చెన్నై వెళ్లిన ఆమె కోలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు పలువురిపైన తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడింది. ఇలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో అలజడి రేపిన ఆమె తాజాగా ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించింది.
‘చెన్నై ప్రెస్‌క్లబ్’లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… తనను మోసగించిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని మరోసారి కుండ బద్దలు కొట్టింది. తనను లైంగికంగా వాడుకున్న వారి ఫోటోలు, వీడియోలు తన వద్దే ఉన్నాయని, ‘రెడ్డి డైరీ’ మూవీ ద్వారా వాటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. తాను నటించబోయే ‘రెడ్డి డైరీ’ చిత్రానికి సహకరిస్తామని ‘నడిగర్ సంఘం’ హామీ ఇచ్చిందన్నారు. శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రెడ్డి డైరీ’ని రూపొందిస్తున్నామని చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్ చెప్పారు.