ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై యశ్వంత్ మూవీస్ ప్రెజెంట్స్ ‘దేవిశ్రీప్రసాద్’. పూజా రామచంద్రన్, భూపాల్, మనోజ్ నందమ్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. కళ్యాణ్ కృష్ణ, శ్రీనివాసరెడ్డి, అమ్మ రాజశేఖర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా ..
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ “టైటిల్ చూస్తుంటే కొత్త కాన్సెప్ట్ ను ఎక్సపెక్ట్ చేయొచ్చు. డైరెక్టర్ శ్రీ కిషోర్ నాకు బాగా తెలుసు. తను చేసే ప్రతి సినిమా కొత్తగా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రం కూడా అలానే ఉంటుందని భావిస్తున్నాను“ అన్నారు.
నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రంలో నటించిన ముగ్గురూ నాకు ఫ్రెండ్స్ కావడంతోనే ఈ ఫంక్షన్ కు హాజరయ్యాను. బ్యానర్ కు, నటీనటులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ చిత్ర కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను“ అన్నారు.
నిర్మాత డి వెంకటేష్ మాట్లాడుతూ “కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నా.. ఎంత కష్టం ఎదురయినా సినిమాను 10తేదీన విడుదల చేస్తున్నాము. యూ ఎస్ ఎ లో 45 థియేటర్లలో దేవిశ్రీప్రసాద్ ను విడుదలచేస్తున్నాం“ అని అన్నారు.
నాగ అన్వేష్ మాట్లాడుతూ “ఈ సినిమా ద్వారా నెగటివిటీ చూపించడం లేదు. ప్రతి అమ్మాయి చూసేలా ఉంటుంది ఈ చిత్రం. డిఫరెంట్ సబ్జెక్టును ఆదరిస్తారని కోరుతున్నాం“ అని తెలిపారు.
భూపాల్, ధనరాజ్, పూజా రామచంద్రన్, నిర్మాత ఆక్రోష్, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్ అవుతుందని తెలిపారు.
పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః కమ్రాన్, కెమెరాః ఫణీంద్ర వర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్రమౌళి.ఎం, మాటలుః శేఖర్ విఖ్యాత్, శ్రీ కిషోర్, లైన్ ప్రొడ్యూసర్ః చంద్ర వట్టికూటి, నిర్మాతలుః డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంః శ్రీ కిషోర్.